సమగ్ర భూ సర్వేపై అవగాహన

ABN , First Publish Date - 2020-12-19T05:46:43+05:30 IST

భుత్వం నిర్వహించనున్న సమగ్ర భూ సర్వేపై అవగాహనా కార్యక్రమాన్ని మండలంలోని మిట్టపాలెం, మేడపి, రామసముద్రం గ్రామాల్లో శుక్రవారం నిర్వహించారు.

సమగ్ర భూ సర్వేపై అవగాహన
మాట్లాడుతున్న తహసీల్దారు కిరణ్‌

త్రిపురాంతకం, డిసెంబరు 18 : ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర భూ సర్వేపై అవగాహనా కార్యక్రమాన్ని మండలంలోని మిట్టపాలెం, మేడపి, రామసముద్రం గ్రామాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దారు కిరణ్‌ మాట్లాడుతూ మొదటి విడతలో మాధవానిపల్లిని ఫైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారన్నారు. రైతులందరూ దగ్గరుండి రీసర్వే చేయించుకోవాలని సూచించారు. వైఎ్‌సఆర్‌ శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై గ్రామస్థులకు వివరించారు. కార్యక్రమంలో మండల సర్వేయర్‌ ఎన్‌.గురవ య్య, వీఆర్వోలు ఎం.తేజేశ్వరి, నాగరాజు, పీఎస్‌ బాలకృష్ణ, వీఎస్‌ విజయరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

రీ సర్వేతో భూసమస్యల పరిష్కారం

 ఎర్రగొండపాలెం : రీ సర్వేతో భూసమస్యలు పరిష్కారం అవుతాయని, సర్వే అధికారులు సిబ్బంది ఆయా గ్రామాల్లో సర్వేచేసే సమయంలో భూయజమానులు అందుబాటులో ఉండాలని ఇన్‌చార్జ్‌ తహసీల్దారు వి వీరయ్య అన్నారు. మండలంలోని కొలుకుల గ్రామంలో శుక్రవారం భూము ల రీసర్వేపై భూ యజమానులకు, రైతులకు అవగాహన సభ నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం పట్టాభూములు సర్వే చేసి రికార్డులలో హెచ్చుతగ్గులను సరి చేస్తామన్నారు. ప్రస్తుతం వెబ్‌ల్యాండ్‌లో ఆన్‌లైన్‌ అయిన భూమికి ఆర్‌ఎస్‌ ఆర్‌ రికార్డు ప్రకారం ఉన్న భూమికి లెక్కలు సరిపోవాల్సి ఉందని అన్నారు. హెచ్చుతగ్గులు ఉంటే సవరణలు చేసి  ఎవరి వాటా తగ్గితేవారికి ఆన్‌లైన్‌ చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల సర్వేయరు సురేష్‌, సచివాలయ  సర్వేయర్లు, వీఆర్వోలు, రైతులు పాల్గొన్నారు.

Read more