నిస్సారం!
ABN , First Publish Date - 2020-12-30T05:21:18+05:30 IST
అధిక దిగుబడుల కోసమో లేక అవగాహన లోపం వల్లనో కానీ ఇటీవల కాలంలో రసాయన ఎరువుల వాడకం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. దీంతో భూసారం తగ్గడంతో పాటు వాతావరణ సమతుల్యత కూడా దెబ్బతినే స్థా యికి చేరింది.
ప్రమాదకర స్థాయిలో రసాయన ఎరువుల వాడకం
సారం కోల్పోతున్న భూములు
రైతులపై అదనపు భారం
ఒంగోలు (జడ్పీ), డిసెంబరు 29: అధిక దిగుబడుల కోసమో లేక అవగాహన లోపం వల్లనో కానీ ఇటీవల కాలంలో రసాయన ఎరువుల వాడకం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. దీంతో భూసారం తగ్గడంతో పాటు వాతావరణ సమతుల్యత కూడా దెబ్బతినే స్థా యికి చేరింది. రసాయన ఎరువుల వాడకంలో సమతు ల్యతను పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కా నీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉం టున్నాయి. వ్యవసాయ భూముల్లో సాయిల్డ్‌టెస్ట్‌లు జరిపి అవసరం మేరకు మా త్రమే ఎరువులను వినియోగించేలా అవగాహన క ల్పించాల్సిన యంత్రాంగాలు మొద్దునిద్ర పోతుండడం తో రైతులు తమకు తెలియకుండానే భూములసారాన్ని గుల్ల చేసుకుంటున్నారు. ఎంత ఎక్కువగా రసాయనా లు వాడితే దిగుబడి అంత గణనీయంగా వస్తుందన్న అపోహాలు కూడా రైతులు వీటిని పరిమితికి మించి వాడటానికి కారణభూతమవుతున్నాయి. ఆయా భూ ముల మట్టి తత్వాన్ని బట్టి వీటిని ఎంపిక చేసుకుని కాల పరిమితి మధ్యలో సంబంఽధిత వ్యవసాయ నిపుణుల సలహాల మేరకు రసాయనాలను వాడితే రైతులకు కూడా మేలు జరుగుతుంది. సంబంధిత అధికారులు కూడా గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడంతో పాటు భూసార పరీక్షలు కూడా విధిగా జరిపి అన్నదాతలకు సూచనలు, సలహాలు ఇస్తే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు.
అవగాహన కల్పించే దిశగా వ్యవసాయశాఖ
ఈక్రమంలో ఆలస్యంగా మేలుకున్న రాష్ట్ర ప్ర భుత్వం ఇటీవలే సమగ్ర పోషక యాజమాన్యం పేరు తో రైతులకు ఎరువుల వాడకంపై అవగాహన కల్పించ డానికి పూనుకుంది. ఇందుకోసం రైతుభరోసా కేంద్రా ల పరిధిలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమాల్లో కూడా రసాయన ఎరువులు మితిమీరి వాడడం వల్ల ఎదురయ్యే దుష్ప్రరిణామాలను రైతులకు క్షేత్రస్థాయి లో వివరిస్తున్నారు.
గత ఖరీఫ్ సీజన్‌లో
జిల్లాలో ఎరువుల వినియోగం(మెట్రిక్ టన్నుల్లో)
యూరియా 35,000
డీఏపీ 10,000
కాంప్లెక్స్ 30,000
ఎస్‌ఎస్‌పీ 22,000
ఎంఓపీ 1,400
ఇతర రకాలు 4,100
మొత్తం 1,02,500