వ్యవసాయ పథకాలకు కౌలు రైతులు అర్హులు

ABN , First Publish Date - 2020-12-13T06:36:38+05:30 IST

అన్ని వ్యవసాయ పథకాలకు కౌలు రైతులు అర్హులని వ్యవసాయాధికారి ఎస్‌.రామ్మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

వ్యవసాయ పథకాలకు కౌలు రైతులు అర్హులు


గిద్దలూరు, డిసెంబరు 12 : అన్ని వ్యవసాయ పథకాలకు కౌలు రైతులు అర్హులని వ్యవసాయాధికారి ఎస్‌.రామ్మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైతే భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారో వారే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు అర్హులవుతారని పేర్కొన్నారు. పంట నష్టపరిహారం, ఉచిత పంటల బీమా పథకం, మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకోవడానికి కౌలు రైతులకు అవకాశం ఉంటుందన్నారు. కౌలు రైతులు సమీప గ్రామ రైతు భరోసా కేంద్రాలలో పేరు మార్చుకోవచ్చన్నారు. పంట నమోదులో ఒకవేళ భూయజమాని పేరు నమోదైతే  కౌలు రైతులు దరఖాస్తు చేసుకుంటే పేరు మార్పు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని కౌలు రైతులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-12-13T06:36:38+05:30 IST