వ్యవసాయ పీజీ కోర్సులకు కేబీఆర్‌ కళాశాల విద్యార్థుల ఎంపిక

ABN , First Publish Date - 2020-12-04T05:05:36+05:30 IST

ఈ ఏడాది పలు విశ్వ విద్యాలయాలలో వివిధ వ్యవసాయ పీజీ కోర్సుల ప్రవే శానికి జరిగిన ఎంపికలో మండలంలోని శీలంవారిపల్లి కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల నుంచి 14 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల డీన్‌ డాక్టర్‌ జి.భూపాల్‌ రాజ్‌ గురువారం ప్రకటనలో తెలిపారు.

వ్యవసాయ పీజీ కోర్సులకు  కేబీఆర్‌ కళాశాల విద్యార్థుల ఎంపిక


సీఎస్‌పురం, డిసెంబరు 3 : ఈ ఏడాది పలు విశ్వ విద్యాలయాలలో వివిధ వ్యవసాయ పీజీ కోర్సుల ప్రవే శానికి జరిగిన ఎంపికలో మండలంలోని శీలంవారిపల్లి కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల నుంచి 14 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల డీన్‌ డాక్టర్‌ జి.భూపాల్‌ రాజ్‌ గురువారం ప్రకటనలో తెలిపారు. భారత వ్యవ సాయ పరిశోధనా మండలి ద్వారా ముగ్గురికి, ఆచార్యా ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 5గురికి, ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ కళాశాలలో ఒకరికి ఇతర విశ్వవిద్యాలయాలలో 5 గురికి సీట్లు రావడం జరి గిందని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా కేబీఆర్‌ విద్యా సంస్థల వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూ రావు,  చైర్మన్‌ కే.వి.ప్రకాశరావు, సెక్రటరీ, కరస్పాండెంట్‌ పార్థసారథి, అధ్యాపకులు విద్యార్థులను అభి నందించారు.


Updated Date - 2020-12-04T05:05:36+05:30 IST