కర్ణాటక మద్యం క్వార్టర్‌ బాటిళ్లు 82 స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-26T04:21:42+05:30 IST

మార్టూరు కూరగాయల మార్కెట్‌ నుంచి లంబాడితండాకు వెళ్లే రోడ్డులో శుక్రవారం అద్దంకి ఎక్సైజ్‌ పోలీసులు ఒక వ్యక్తి దగ్గర 82 క్వార్టర్ల కర్నాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ సోమ ఆంజనేయులు చెప్పారు.

కర్ణాటక మద్యం క్వార్టర్‌ బాటిళ్లు 82 స్వాధీనం
స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లతో అద్దంకి ఎక్సైజ్‌ పోలీసులుమార్టూరు, డిసెంబరు 25 : మార్టూరు కూరగాయల మార్కెట్‌ నుంచి లంబాడితండాకు వెళ్లే రోడ్డులో శుక్రవారం అద్దంకి ఎక్సైజ్‌ పోలీసులు ఒక వ్యక్తి దగ్గర 82 క్వార్టర్ల కర్నాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ సోమ ఆంజనేయులు చెప్పారు.తండాకు చెందిన బాణావతు రవికిషోర్‌నాయక్‌ ద్విచక్రవాహనంపై ఒరిజనల్‌ చాయిస్‌ డీలక్స్‌ విస్కీకి చెందిన 82 టెట్రా బాక్స్‌లను ఇంటికి తీసుకువెళుతుండగా ఒంగోలు ఎస్‌ఈబీ వారి సూచనల మేరకు సీఐ బెల్లంకొండ శ్రీనివాసరావు ఆదేశాలతో దాడి చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అతన్ని, అరెస్ట్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - 2020-12-26T04:21:42+05:30 IST