ఘనంగా కందుల నాగార్జునరెడ్డి జయంతి

ABN , First Publish Date - 2020-12-15T06:24:24+05:30 IST

మాజీఎమ్మెల్యే దివంగత నేత కందుల నాగార్జునరెడ్డి అందరివారని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు.

ఘనంగా కందుల నాగార్జునరెడ్డి జయంతి
నాగార్జునరెడ్డి విగ్రహానికి నివాళి అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు


కంభం, డిసెంబరు 14 : మాజీఎమ్మెల్యే దివంగత నేత కందుల నాగార్జునరెడ్డి అందరివారని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు. కందుల నాగార్జునరెడ్డి జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయన కుమారుడు కందుల గౌతమ్‌రెడ్డి కంభం చెరువుకట్టపై ఏర్పాటు చేసి జయంతి ఉత్సవాలు, కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్‌టీఆర్‌ ప్రభంజనం ఉన్న 1983 ఎన్నికల్లో కూడా కంభం నియోజకవర్గం నుంచి నాగార్జునరెడ్డి  కాంగ్రెస్‌ తరఫున గెలిచారన్నారు. ప్రజల వెన్నంటే ఉండి వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన గొప్పనాయకుడని పేర్కొన్నారు. నాగార్జునరెడ్డి 1981 నుంచి రాజకీయాలలో అడుగుపెట్టి 1986-87 సంవత్సరంలో కరువు యాత్ర, వెలుగొండ ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేశారన్నారు. నాలుగు పర్యాయాలు కంభం ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. ఈ సందర్భంగా వై.జంక్షన్‌లో కందుల నాగార్జునరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో మార్కాపురం మాజీఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, గొంగటి చెన్నారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. 


రక్తదాన శిబిరం ఏర్పాటు

కందుల నాగార్జునరెడ్డి జయంతి సందర్భంగా కంభం చెరువుకట్టపై మాగుంట చారిటబుల్‌ ట్రస్టు మరియు కందుల గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పలువురు యువకులు రక్తదానం చేశారు.

Read more