వివాహమైన మూడు రోజులకే..

ABN , First Publish Date - 2020-07-28T11:20:10+05:30 IST

వివాహమైన మూడు రోజులకే ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

వివాహమైన మూడు రోజులకే..

వరుడు ఆత్మహత్య

బొద్దికూరపాడు సమీపంలో మృతదేహం తాళ్లూరు,


ప్రకాశం: వివాహమైన మూడు రోజులకే ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహాన్ని సోమవారం బొద్దికూరపాడులోని సూరాయపాలెం వద్ద జాతీయ రహదారికి సమీపంలో గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. చీమకుర్తి మండలం పుట్టచెరువుపాలెంకు చెందిన శింగరాజు వేణు(30)కు  ఈ నెల 24న జరుగుమల్లి మండలం పమిడిమర్రు గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. వీరు 25న వ్రతం చేశారు.


26న అత్తగారింటికి వెళ్లాల్సిన వేణు అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిడండ్రులు వెతుకులాట ప్రారంభించారు. బొద్దికూరపాడు సమీప పొలాల్లో ఓ యువకుడు పురుగుల మందు తాగి మృతి చెందివున్నాడని తెలిసి అక్కడకు వెళ్లారు. వేణు మృతదేహాన్ని గుర్తించి కన్నీరు మున్నీరుగా విలపించారు. తాళ్లూరు పోలీసులకు సమాచా రం అందడంతో కేసు నమోదు చేసి,  చీమకుర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన మృతికి  కా రణాలు పోలీసుల ద ర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.


Updated Date - 2020-07-28T11:20:10+05:30 IST