పంట ఉత్పత్తులను రైతు భరోసా కేంద్రాల్లో అమ్మాలి

ABN , First Publish Date - 2020-11-13T06:10:24+05:30 IST

రైతులు ద ళారుల మాటలు నమ్మి మోసపోకుండా పంటలను రైతు భరోసా కేంద్రాల్లో విక్ర యించి మద్దతు ధర పొందాలని జేసీ ము రళీకృష్ణ కోరారు.

పంట ఉత్పత్తులను రైతు భరోసా కేంద్రాల్లో అమ్మాలి
సజ్జలలో తేమ శాతాన్ని పరిశీలిస్తున్న జేసీ మురళీకృష్ణ

 


 జేసీ మురళీకృష్ణ 


బల్లికురవ, నవంబరు 12 : రైతులు ద ళారుల మాటలు నమ్మి  మోసపోకుండా పంటలను రైతు భరోసా కేంద్రాల్లో విక్ర యించి మద్దతు ధర పొందాలని జేసీ ము రళీకృష్ణ కోరారు. గురువారం మండలంలో ని గుంటుపల్లి గ్రామంలో రైతు భరోసా కేం ద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. సజ్జల కో నుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతుల ను ఇబ్బందులు పెట్టకుండా వెంటనే సజ్జ లను కోనుగోలుచేయాలని  సూచించారు.  కొందరు రైతులు తమ వద్ద సజ్జలు  ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం కొంత మెత్తాన్నే కొను గోలు  చేస్తోందని ఇలా అయితే తాము నష్ట పో తామని చెప్పగా వాటిని కూడా కోనుగోలు చేసే లా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.  జి ల్లాలో రైతులంతా తాము ఏ పంటలు వేసినా వెంటనే ఈ-క్రాప్‌ చేయించుకోవాలని జేసీ సూ చించారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ ఎమ్‌డీ నళినిదేవి, తహసీల్దార్‌ అశోక్‌వర్ధన్‌, ఎంపీడీవో వై.శ్రీనివాసరావు, ఏడీఏ ఎఫ్రాయిం,  ఏవో కుమా రి, సొసైటీ చైర్మన్‌ ఎం.నాగేశ్వరరావు, సీ ఈవోలు శ్రీనివాసరావు, ఖాజారావు  రై తులు పాల్గొన్నారు. 


రైతుల ఫిర్యాదు

పేరుకే గ్రామ సచివాలయాలు అని, అందులో సేవలు అందటం లేదని గుం టుపల్లి వచ్చిన జేసీ మురళీకృష్ణకు రై తులు  ఫిర్యాదు చేశారు. రెవెన్యూ సమ స్యలు పెండింగ్‌లో ఉంటున్నాయని ఎన్ని సార్లు తిరిగినా ఎవరు పట్టించుకోవటం లేదని  రైతులు మాదాల లోకేశ్వరరావు, శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.  సరైన సమాధానం కూడా చెప్పడం లేదని ఆవేదన వ్య క్తం చేశారు.  జేసీ వెంటనే తహసీల్దార్‌ అశోక్‌ వ ర్ధన్‌కు పలు సూచనలు చేశారు. రైతుల సమస్య లు పరిష్కరించాలని, ఏదైనా సమస్య ఉంటే ఆ ఫైల్‌ తనకు పంపించాలని ఆదేశించారు.  


Updated Date - 2020-11-13T06:10:24+05:30 IST