ఓటమి భయంతోనే వైసీపీ దౌర్జన్యం

ABN , First Publish Date - 2020-03-16T11:29:03+05:30 IST

ప్రజాతీర్పులో ఓడిపోతామనే భయంతోనే వైపీసీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని టీడీపీ జిల్లా

ఓటమి భయంతోనే వైసీపీ దౌర్జన్యం

 టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ ధ్వజం


ఒంగోలు (కార్పొరేషన్‌) మార్చి 15 : ప్రజాతీర్పులో ఓడిపోతామనే భయంతోనే వైపీసీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌  విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులపై దాడులు, అక్రమ కేసులు, అధికారుల ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, అధికారం పేరుతో ఎన్నికల ప్రక్రియను అభాసుపాలు చేశారని ఆక్షేపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ, జడ్పీ టీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలలో ఓడి పోతామనే భయంతోనే వైసీపీ దిగజారుడుతనానికి పాల్ప డుతుందని దామచర్ల పేర్కొన్నారు. దీనిపై న్యాయపో రాటం చేస్తామన్నారు. జిల్లాలో అంతటా టీడీపీ నేతలను భయపెట్టి మరీ ఉపసంహరణలు చేయించి, ఏకగ్రీవం చేసుకోవడం నైతికంగా ఓడిపోయినట్లేనన్నారు. కక్ష్యసాధిం పులు, బెదిరింపులతో వ్యవహరిస్తున్న తీరును అడ్డుకో కుండా పోలీసులు, అధికారులు సైతం అడ్డుకోకుండా ప్రేక్షకపాత్ర పోషించడం అన్యాయమన్నారు.


తాము అధికారంలో ఉన్నప్పడు పార్టీలకతీతంగా అందరికీ న్యాయం చేశామన్నారు. పోలీసుల తీరులో ఏనాడు జోక్యం చేసుకోలేదన్నారు. ఇపుడు పోలీసు యంత్రాంగం రాజకీయ నాయకుల అండదండలతో ఉద్దేశపూర్వకంగా టీడీపీ నేతలను ఇబ్బందులకు గురిచేయడం దారుణ మన్నారు. బల్లికురవ మండలంలోని వేమవరంలో ఇళ్లలోకి వెళ్లి బెదిరించడం అన్యాయమన్నారు. ఒంగోలు కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లను తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి బాలినేని ప్రైవేటు పీఆర్వో, మరి కొందరు వ్యక్తులు కార్పొరేషన్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల వద్ద నామి నేషన్ల పత్రాలు బయటకు తీసుకొచ్చి వారికి అను కూలంగా మార్చుకోగా, టీడీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను తారుమారు చేసి, తిరస్కరణ జరిగేలా కుట్ర పన్నారని ఆరోపించారు. జిల్లాలో టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా మంత్రి బాలినేని నేతృత్వంలో ఈ వ్యవహారం  సాగుతుందని దామచర్ల ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాలు వాయిదా వేయడం శుభపరిణా మన్నారు.


టీడీపీ తరుపున కార్పొరేటర్‌ అభ్యర్థులుగా పోటీచేసిన కామరాజు గడ్డ కుసుమకుమారి, లక్కరాజు కామేశ్వరరావు, పుట్లూరి సురేష్‌ నామినేషన్లను తిరస్కరించ డంలో కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, రిటర్నింగ్‌ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి పాత్రఉందని దామ చర్ల పేర్కొన్నారు. అధికారులు, పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు.ఎన్నికల కమి షన్‌కు ఫిర్యాదుచేసి, న్యాయం కోరతా మని దామచర్ల తెలిపారు. విలేకరుల సమా వేశంలో కే.కుసుమకుమారి, లక్కరాజు కామే శ్వరరావు, పుట్లూరి సురేష్‌  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-16T11:29:03+05:30 IST