14 మంది జూదరుల అరెస్టు
ABN , First Publish Date - 2020-11-14T02:51:40+05:30 IST
పేకాట ఆడుతున్న 14 మంది జూదరులను సీఐ యూ.సుధాకరరావు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు.
రూ.1.93 లక్షల నగదు స్వాధీనం
గిద్దలూరు టౌన్, నవంబరు 13 : పేకాట ఆడుతున్న 14 మంది జూదరులను సీఐ యూ.సుధాకరరావు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.93 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.