తోడు పథకం చిరు వ్యాపారులకు వరం

ABN , First Publish Date - 2020-11-26T05:41:12+05:30 IST

తోడు పథకం చిరు వ్యాపారులకు వరం

తోడు పథకం చిరు వ్యాపారులకు వరం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి


ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

పొదిలి, నవంబరు 25 : ‘జగనన్న తోడు’ చిరు వ్యాపారులకు వరం అని ఎమ్మెల్యే కుం దురు నాగార్జునరెడ్డి అన్నారు. బుధవారం  మండల పరిషత్‌ కార్యాలయంలో ఆయన పథకాన్ని ప్రారంభించారు. పలువురు లబ్ధి దారులకు రుణ మంజూరు పత్రాలను అంద జేశారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మా ట్లాడుతూ తోడు పథకం కింద మండలంలో 950 మందిని అర్హులుగా గుర్తించడం జరిగిందన్నారు. వారిలో మొదటి విడత 277 మందికి వడ్డీలేని రుణాలను అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ హనుమంతరావు, ఎంపీడీవో శ్రీకృష్ణ, స్పెషలాఫీసర్‌ శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గుర్రపుశాల కోటేశ్వరి శ్రీనివాస్‌, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి,  జిల్లా కార్యదర్శి గొలమారి చెన్నారెడ్డి, రెడ్డి జేఏసీ రాష్ట్ర నాయకుడు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

కనిగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సం క్షేమ పథకాల లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఉందని ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌ అన్నారు. పట్టణంలోని 12వ సచివాలయం లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న తోడు కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో  కమిషనర్‌ డీవీఎస్‌ నారాయ ణరావు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం పామూరులో ఆయన పథకం ప్రారంభిం చారు. కార్యక్రమంలో ఎంపీడీవో రంగసుబ్బ రాయుడు పాల్గొన్నారు.  

దొనకొండ : రాష్ట్ర ప్రభుత్వం చిరువ్యాపారుల జీవనోపాధి పెంపొందించేందుకు జగనన్నతోడు పథకంతో అందించిన రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎం పీడీవో కె.జీ.యస్‌.రాజు సూచించా రు. మండల పరిషత్‌ కార్యాలయం లో జగనన్నతోడు పథకంలో లబ్ధిదారులకు రుణ మంజూరు అర్హత కార్డులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలో మొద టి విడతగా 974 మందికి ఒకొక్క రికీ రూ.10వేల రుణం వారి బ్యాం కు ఖాతాల్లో  జమచేశారన్నారు. కార్యక్రమంలో వైకేపీ ఏపీఎం హ నుమంతరావు, మండల పరిషత్‌ సిబ్బంది, పలు గ్రామాలకు చెంది న లబ్ధిదారులు పాల్గొన్నారు. 

దర్శి : పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని నియోజకవర్గ వైసీపీ నాయకుడు మద్దిశెట్టి రవీంద్ర పేర్కొన్నారు.  ఎంపీడీవో ఆఫీస్‌లో జగనన్నతోడు లబ్ధిదారులకు నగ దు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో గుత్తా శోభన్‌బాబు, తహసీల్దార్‌ డీవీబీ వరకుమార్‌,  నాయకులు పాల్గొన్నారు.

తాళ్లూరు : పేదకుటుంబాలకు ఆర్థిక స హకారం అందించి ఆదుకునేందుకు జగనన్న తోడు పథకం ఉపకరిస్తుందని ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు తెలిపారు. తాళ్లూరు గ్రా మసచివాలయం వద్ద జగనన్నతోడు పథకం ప్రారంభించారు. 


Updated Date - 2020-11-26T05:41:12+05:30 IST