-
-
Home » Andhra Pradesh » Prakasam » Issuing government orders
-
ఆ రోగ్యశ్రీ పరిధిలోకి కరోనా
ABN , First Publish Date - 2020-04-07T11:01:40+05:30 IST
ప్రైవేట్ వైద్యశాలలో కరోనా రోగులకు చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగానే ప్రైవేట్

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ఒంగోలు నగరం, ఏప్రిల్ 6: ప్రైవేట్ వైద్యశాలలో కరోనా రోగులకు చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగానే ప్రైవేట్ వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్(పీపీఈ) కిట్లను అందించాలని నిర్ణయించింది. ఒంగోలులోని కిమ్స్, సంఘమిత్ర, నల్లూరి, వెంకటరమణ ఆస్పత్రుల ద్వారా సేవలను అందించనున్నది. ఇప్పటికే జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 10 కేసులను రిమ్స్ నుంచి కిమ్స్‌కు తరలించారు. తమకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్(పీపీఈ)కిట్లు అందుబాటులో లేదన్న ఉద్దేశంతో కరోనా రోగులకు వైద్యం అందించేందుకు ప్రైవేట్ వైద్యులు ముందుకు రావడం లేదు. తమకు రక్షణ లేదని వారు వెనుకంజ వేస్తున్నారు. దీనికి స్పందించిన ప్రభుత్వం కిట్లను అందించేందుకు రంగం సిద్ధం చేసింది. గ్లౌజులు, గాగుల్స్(కళ్ళ జోళ్లు),ఫేస్ షీల్డ్స్, హెడ్ కవర్లు, గైన్లు మాస్కులు, షూ కవర్లు అందించేందుకు ముందుకొచ్చింది. రిమ్స్‌లో అందుబాటులో ఉన్న కిట్లను కిమ్స్‌కు పంపించినట్టు సమాచారం.
ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా..
డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ కింద కరోనాను చేర్చుతూ రాష్ట్రప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్క రోగికి రూ.16 వేల నుంచి రూ.2.16 లక్షల రూపాయలను కేటాయించాలని నిర్ణయించింది. అనుమానిత రోగులకు పరీక్షలు నిర్వహించడం, నిర్ధారణ కాక పోతే 14 రోజుల తర్వాత ఇంటికి పంపించాల్సి ఉంది. పాజిటివ్ నిర్ధారణ అయితే రోగికి పూర్తిస్థాయిలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాల్సి ఉంది.