ఆరుష్‌రెడ్డి అదృశ్యంపై దర్యాప్తు

ABN , First Publish Date - 2020-03-18T11:20:13+05:30 IST

ఆరుష్‌రెడ్డి అదృశ్యం కేసును ఛేదించ డానికి పోలీస్‌ యంత్రాంగం కదిలింది.రెడ్డినగర్‌కు చెందిన మేడం అశోక్‌రెడ్డి, జ్యోతి

ఆరుష్‌రెడ్డి అదృశ్యంపై  దర్యాప్తు

ముండ్లమూరు, మార్చి 17 : ఆరుష్‌రెడ్డి అదృశ్యం కేసును ఛేదించ డానికి పోలీస్‌ యంత్రాంగం కదిలింది.రెడ్డినగర్‌కు చెందిన మేడం అశోక్‌రెడ్డి, జ్యోతి దంపతుల కుమారుడు ఆరుష్‌రెడ్డి అదృశ్యం కేసును సీరియస్‌గా తీసుకోవాలని జిల్లా ఎస్పీని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆరుష్‌రెడ్డి  తండ్రి అశోక్‌రెడ్డి తమ గోడను సీఎం దగ్గర వెళ్లబుచ్చుకోవడంతో వెంటనే బాలుడు ఆచూకీ కనిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఎస్సీ ఆదేశాల మేరకు మంగళవారం దర్శి డీఎస్సీ కె ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో దర్శి, అద్దంకి, పొదిలి సీఐలు మహ్మద్‌ మొయిన్‌, అశోక్‌వర్దన్‌రెడ్డి, ముండ్లమూరు ఎస్‌ఐ కె రామకృష్ణతో సమావేశమయ్యారు.


ఆరుష్‌రెడ్డి అదృశ్యంపై లోతుగా దర్యాప్తు చేయా లని సూచించారు.బాలుడు ఆచూకీని ఎలాగైనా కనిపెట్టాలని వారంతా నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం ఆరుష్‌రెడ్డి తల్లిదండ్రులు ఆశోక్‌రెడ్డి, జ్యోతి దంపతులను దర్శి డీఎస్పీ తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు.అనుమానితుల పేర్లతో పాటు వారి కాల్‌డేటాను ఆధారంగా తీసుకొని కేసు దర్యాప్తు చేయడానికి సిద్ధమయ్యారు.  

Updated Date - 2020-03-18T11:20:13+05:30 IST