21న పాఠశాలల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

ABN , First Publish Date - 2020-02-17T10:12:41+05:30 IST

జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఈనెల 21న అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవాన్ని నిర్వహించినట్టు

21న పాఠశాలల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

ఒంగోలు విద్య, ఫిబ్రవరి 16 : జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఈనెల 21న అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవాన్ని నిర్వహించినట్టు జిల్లావిద్యాశాఖాధికారి వీఎస్‌ సుబ్బారావు తెలిపారు. మాతృభాష వ్యాప్తిని ప్రోత్సహించ డానికి ప్రపంచ వ్యాప్తంగా భాష సాంస్కృతిక, సంప్ర దాయాలపై అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. పాఠశాలలకు ఈనెల 21న సెలవు ప్రకటిస్తే ఒకరోజు ముందుగా ఈనెల 20నే అంతర్జాతీయ భాషా దినోత్సవాన్ని నిర్వహించాలని కోరారు. మాతృభాష దినోత్సవంలో  మాతృభాషాలో రాజ్యాంగం ముందుమాట కథనం, రాజ్యాంగంలోని ఉపోద్ఘాతం పఠనం, బృంద, జానపద పాటలు, వ్యాసరచన పొటీలు, చర్చలు, బోర్డులు, పోస్టర్ల ద్వారా దేశ భాషలను ప్రదర్శించాలి. భారతీయ భాష వారసత్వంపై జీకే పోటీలు నిర్వహించాలి. వీటితోపాటు మాతృభాషను ప్రోత్సహించేలా ఇతర కార్యక్రమాలు నిర్వహించవచ్చునని డీఈవో  సుబ్బారావు చెప్పారు. 

Updated Date - 2020-02-17T10:12:41+05:30 IST