పీడీసీసీబీలో అవినీతి అక్రమాలపై విచారణ

ABN , First Publish Date - 2020-03-18T11:08:22+05:30 IST

పీడీసీసీ బ్యాంకులో ఇటీవల కాలంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ ప్రారంభమైంది.

పీడీసీసీబీలో అవినీతి అక్రమాలపై విచారణ

విచారణాధికారి రాఘవయ్య 


ఒంగోలువిద్య, మార్చి 17 : పీడీసీసీ బ్యాంకులో ఇటీవల కాలంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ ప్రారంభమైంది. ఆప్కాబ్‌ డీజీఎంగా పనిచేస్తున్న బి.వి.రాఘవయ్య మంగళవారం విచారణ ప్రారంభించారు. ప్రధానంగా బ్యాంకు సీఈవో అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్‌కు ఒంగోలుకు చెందిన జి.వెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభు త్వం విచారణకు ఆదేశించింది. బ్యాంకులో జరుగుతున్న అనేక అవినీతి, అక్రమాల గురించి ఫిర్యాదిదారు తన ఫిర్యాదులో  పేర్కొన్నారు. ఫిర్యాదులు ఇవీ... బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి ఎవరికైనా బదిలీ కావాలంటే కనీసం రూ.50వేలు ఇస్తేకానీ బదిలీ అయ్యే పరిస్థితి లేదు.  రిటైర్‌ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్‌ పొందేందుకు లక్షరూపాయలు డిమాండ్‌ చేస్తున్నారు. 15 నుంచి 20 మంది రిటైర్డు ఉద్యోగులు బెనిఫిట్స్‌ రాక ఇబ్బంది పడుతున్నారు.


డీజీఎంగా పనిచేసి రిటైర్‌ అయిన అంజయ్యకు కూడా ఇప్పటివరకు బెనిఫిట్‌ చెల్లించలేదు. అన్ని రకాల విచారణలు పూర్తయినా, అవసరమైన అన్ని పత్రాలు సమర్పించినా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వివిధ కారణాలతో సస్పెండ్‌ అ యి కోర్టు ఉత్తర్వులు ద్వారా వేతనాలు పొం దుతున్న ఎనిమిదిమంది ఉద్యోగుల నుంచి ప్రతినెలా లైవ్‌ సర్టిఫికెట్లతోపాటు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. బ్యాంకు కార్యకలాపాల్లో ఒక సామాజిక వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా ఉద్యోగుల బెనిఫిట్లు ఆపుతున్నారు. సస్పెండ్‌ అయ్యి కోర్టు ద్వారా పునర్‌నియామక ఉత్తర్వులు తెచ్చుకున్న ఓ అధికారి డబ్బులు ఇవ్వలేదన్న సాకుతో వాటిని అమలు చేయకుండా బ్యాంకులో పనిచేస్తున్న ఆ అధికారి భార్యను ఒంగోలు నుంచి యర్రగొండపాలేనికి బదిలీ చేశారు.


బ్యాం కులో లక్షరూపాయల లోనుకు రూ.10వేలు డిమాండ్‌ చేస్తున్నారు. బ్యాంకు దైనందిన కార్యక్రమాలకు కూడా విచ్చలవిడిగా నిధు లు ఖర్చుచేస్తున్నారు. క్యాలెండర్ల ముద్రణలో అవినీతి జరిగింది. మంగళవారం  విచారణాధికారి రాఘవయ్య ఫిర్యాదుదారు వెంకట్రామిరెడ్డిని కొన్ని ప్రశ్నలు అడిగి రాతపూర్వకంగా సమాధానం తీసుకున్నారు.

Updated Date - 2020-03-18T11:08:22+05:30 IST