గాయపడిన మహిళకు ఏలూరి బాసట

ABN , First Publish Date - 2020-12-12T04:11:05+05:30 IST

పర్చూరు మండలంలోని ఉప్పుటూరు మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ గాయపడి రోడ్డుపై పడిఉన్నారు. బాధితురాలి స్థితిని గమనించి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పందించారు.

గాయపడిన మహిళకు ఏలూరి బాసట
గాయపడిన మహిళ గురించి ఫోన్‌లో సమాచారం అందిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు


పర్చూరు, డిసెంబరు 11 : మండలంలోని ఉప్పుటూరు మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ గాయపడి రోడ్డుపై పడిఉన్నారు. బాధితురాలి స్థితిని గమనించి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పందించారు. తన కారును ఆపి ఆమె వద్దకు వెళ్లి పరిస్థితిని గమనించారు. స్వయంగా ఓ వాహనం ద్వారా వైద్యశాలకు తరలించారు. వీరన్నపాలెం పరిసర ప్రాంతాలకు ఎమ్మెల్యే తరలి వెళుతుండగా ఈ సంఘటన ఎదురైంది.

Updated Date - 2020-12-12T04:11:05+05:30 IST