-
-
Home » Andhra Pradesh » Prakasam » illigal constraction
-
వాగు స్థలంలో నిర్మాణం చట్టవ్యతిరేకం
ABN , First Publish Date - 2020-12-28T06:31:53+05:30 IST
ఎర్రగొండపాలెం రాళ్లవాగు స్థలంలో అనుమతులు లేకుండా జరుగుతున్న చర్చి నిర్మాణ పనులను ఇన్‌చార్జ్ తహసీల్దారు వి వీరయ్య ఆదివారం సందర్శించారు.

ఎర్రగొండపాలెం, డిసెంబరు 27 : ఎర్రగొండపాలెం రాళ్లవాగు స్థలంలో అనుమతులు లేకుండా జరుగుతున్న చర్చి నిర్మాణ పనులను ఇన్‌చార్జ్ తహసీల్దారు వి వీరయ్య ఆదివారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేశారు. వాగుస్థలంలో నిర్మాణాలు చేపట్టరాదన్నారు. నిర్మాణానికి అనుమతులు కాని, ఆధారాలు కానీ ఉంటే ధ్రువీకరించు కోవాలని సూచించారు. వీఆర్వో బాలేశ్వరరావు, వీఆర్‌ఏ లు పాల్గొన్నారు.