ప్రభుత్వం ఇస్తున్న ఇంటి స్థలాల పరిశీలన

ABN , First Publish Date - 2020-12-04T05:18:35+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పేదల ఇంటి స్థలాలను గురువారం ఏపీవో అన్నపూర్ణ పరిశీలించారు.

ప్రభుత్వం ఇస్తున్న ఇంటి స్థలాల పరిశీలన

పెద్దారవీడు, డిసెంబరు 3 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పేదల ఇంటి స్థలాలను గురువారం ఏపీవో అన్నపూర్ణ పరిశీలించారు. మండలంలోని తోకపల్లె గ్రామంలో ఇంటి స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25న ఇళ్ల స్థలాలకు సంబంధించిన ప్లాట్లను పేదలకు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా స్థలాల్లో ఉన్నటువంటి కంప రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఈసీ తిరుపాలు, ఇన్‌స్పెక్టర్‌ మల్లారెడ్డి, టీఏ శివారెడ్డి, ముసలయ్య, సర్వేరు చంద్రశేఖర్‌ రెడ్డి, అగ్రికల్చర్‌ ఫస్ట్‌ అండ్‌ ప్రేమ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:18:35+05:30 IST