ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-26T06:28:50+05:30 IST

పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జిల్లాలో శుక్రవారం ప్రారంభమైంది.

ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభం
అద్దంకిలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్న మంత్రి బాలినేని, వేదికపై కృష్ణచైతన్య, గరటయ్య

జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు

పలుచోట్ల పాల్గొన్న మంత్రి బాలినేని 

ఎర్రగొండపాలెంలో  హాజరైన మంత్రి సురేష్‌

ఒంగోలు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జిల్లాలో శుక్రవారం ప్రారంభమైంది. కోర్టు వివాదాలు ఉన్న ప్రాంతా ల్లోని 27,518 మందికి మినహాయించి మిగిలిన 1,06,471మంది లబ్ధిదారులకు స్థలాలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు నియోజకవర్గానికి ఒక చోట అధికారికంగా ప్రభుత్వం తరఫున యంత్రాంగం ఏర్పాటు చేసిన కార్యక్ర మాల్లో కీలక ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. జిల్లా కు చెందిన విద్యుత్‌, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తొలుత ప్రకా శం భవన్‌లోని స్పందన హాల్‌లో జరిగిన కార్యక్రమంలో టిడ్కో ఇళ్ల ఒప్పంద పత్రాల పంపిణీని కలెక్టర్‌ పోలా భాస్కర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఒంగోలు రూరల్‌ మండలం గుండాయపాలెంలో లబ్ధిదారులకు పట్టాలు అందజే శారు. ఆ తర్వాత చీరాల, అద్దంకి, మార్టూరుల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొ న్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తాను ప్రాతినిథ్యం వహించే ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలోని లబ్ధిదారుల కోసం మిల్లం పల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని నివేశన స్థల పట్టాలను పంపిణీ చేశారు. కాగా ఆయా నియోజకవర్గాల్లో జరిగిన కార్యరక్రమాల్లో అక్కడి అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు హాజరయ్యారు. అన్ని ప్రాంతాల్లో పక్షంరోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. స్థలాలు ఇచ్చిన పేదలంద రికీ ఇళ్ల నిర్మాణంతో పాటు, కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించను న్నట్లు ఈ  సందర్భంగా నేతలు, అధికారులు తెలిపారు. 




Updated Date - 2020-12-26T06:28:50+05:30 IST