విశ్వనాథపురంలో ఇళ్ల పట్టాలు పంపిణీ
ABN , First Publish Date - 2020-12-30T06:17:57+05:30 IST
మండలంలోని విశ్వనాథపురం గ్రామంలో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు.

త్రిపురాంతకం, డిసెంబరు 29 : మండలంలోని విశ్వనాథపురం గ్రామంలో పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా 60 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దారు వి.కిరణ్, ఎంపీడీవో సుదర్శనం, వీఆర్వో జి.బాలగురువారెడ్డి, పంచాయితీ కార్యదర్శి నాసర్‌వలి, వైసీపీ నాయకులు కోట్ల సుబ్బారెడ్డి, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.