అర్హులందరికీ నివేశన స్థలాలు
ABN , First Publish Date - 2020-12-01T06:13:34+05:30 IST
అర్హులైన పేదలందరికీ నివేశ న స్థలాలు ఇవ్వాలని సీపీఐ నగర కార్యదర్శి ఎస్‌డీ సర్దార్ డిమాండ్ చేశారు.

ఒంగోలు (రూరల్), నవంబరు 30: అర్హులైన పేదలందరికీ నివేశ న స్థలాలు ఇవ్వాలని సీపీఐ నగర కార్యదర్శి ఎస్‌డీ సర్దార్ డిమాండ్ చేశారు. అలాగే, టిట్కో గృహాల కోసం అర్జీలు పెట్టుకొన్న వారందరికీ వెంటనే ఇవ్వాలని కోరారు. సోమవారం తహసీల్దార్ కార్యా లయం వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. నగరంలోని 30 కాలనీల లో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నా రు. పలు కాలనీల్లో గృహాలు నిర్మించుకున్న పేదలకు వెంటనే పట్టా లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కె.చిరంజీవి కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు వి. హనుమారెడ్డి, ఉప్పుటూరి ప్రకాశరావు, పోలవరపు శీతారామయ్య, కరవది హనుమంతరావు, ఎస్‌కే మస్తాన్, వి.రమణమ్మ పాల్గొన్నారు.
సంతమాగులూరు: అర్హులందరికీ నివేశన స్థలాలు ఇవ్వాలని సో మవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు తన్నీరు సింగరకొండ, నక్కా ఆం జనేయులు, మరియమ్మ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంత రం తహసీల్దార్ వెంకట శివరామిరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
కొత్తపట్నం: నివర్ తుఫాన్‌తో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తగిన నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని వ్యవసాయ కా ర్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటరావు డిమాండ్ చేశారు. సో మవారం సీపీఐ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్‌లో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెం ట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమిని ఇళ్ళస్థలాలుగా ఇవ్వా లని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మద్దెల పోల య్య, జ్వాలరాం, సీపీఐ మండల కార్యదర్శి గోపి తదితరులు పాల్గొన్నారు.
మద్దిపాడు: అర్హులైన పేదలందరికీ 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలా లు మంజూరు చేయాలని సీపీఐ నాయకుడు నల్లూరి గోవిందయ్య అన్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కాలనీల్లో మౌలిక వసతులు కల్పిం చాలన్నారు. అనంతరం తహసీల్దార్ మరియమ్మకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.