అర్హులందరికీ నివేశన స్థలాలు

ABN , First Publish Date - 2020-12-27T06:18:49+05:30 IST

అర్హులం దరికీ నివేశన స్థలాలు ఇస్తామని అద్దంకి వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య పేర్కొ న్నారు. ఇంకా లబ్ధిపొందని అర్హులు ఎవరైనా ఉం టే తహసీల్దార్‌కు దరఖాస్తులు అందజేయాలని ఆయన కోరారు.

అర్హులందరికీ నివేశన స్థలాలు
సంతమాగులూరులో పట్టాలను పంపిణీ చేస్తున్న కృష్ణచైతన్య

అద్దంకి వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య 

లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ


సంతమాగులూరు, డిసెంబరు 26 : అర్హులం దరికీ నివేశన స్థలాలు ఇస్తామని అద్దంకి వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య పేర్కొ న్నారు. ఇంకా లబ్ధిపొందని అర్హులు ఎవరైనా ఉం టే తహసీల్దార్‌కు దరఖాస్తులు అందజేయాలని ఆయన కోరారు. శనివారం సంతమాగులూరులో 22 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మొదటి విడతలో 110 పట్టాలను కృష్ణచైతన్య పంపిణీ చే శారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అట్లా చిన వెంకటరెడ్డి, ప్రత్యేకాధికారి గ్లోరియా, తహసీల్దార్‌ వెంకటశివరామిరెడ్డి, ఎంపీడీవో పట్టాభిరా వు, మండల వైసీపీ కన్వీనర్‌ అట్లా పెదవెంకటరె డ్డి, ఓరుగంటి కోటిరెడ్డి, చింతా రామారావు, ఆలూ రి శ్రీనివాసరావు, అడవి శ్రీను, బొల్లినేని రామకృ ష్ణ, ఏఎంసీ వైస్‌ ప్రెసిడెంట్‌ చింతా పేరయ్య, చి న్నగాలయ్య పాల్గొన్నారు. 


అర్హతే కొలమానం : ఎమ్మెల్యే కరణం 


చీరాల: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు పొందేందుకు అర్హతే కొలమానమని ఎమ్మెల్యే కర ణం బలరామకృష్ణమూర్తి పేర్కొన్నారు. సాల్మన్‌ సెంటర్‌ పంచాయతీ సచివాలయం వద్ద శనివా రం ఇంటి నివేశన స్థలాల పట్టాల పంపిణీ కార్య క్రమం తహసీల్దార్‌ మహ్మద్‌హుస్సేన్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హా జరైన ఎమ్మెల్యే కరణం బలరాం మాట్లాడుతూ అ ర్హులు ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకొని లబ్ధిపొందాలని సూచించారు. చీరాలను ప్రశాం తంగా ఉంచేందుకు ప్రభుత్వ యంత్రాంగం, పోలీ సులు పారదర్శకంగా పనిచేస్తున్నారన్నారు. గతం లో వివిధ వర్గాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొ న్నారని,  ఆ పరిస్థితి ఇప్పుడు లేకుండా భరోసా క ల్పిస్తున్నామని చెప్పారు. 


పాలేటి వ్యాఖ్యలతో దుమారం


వేటపాలెం మండలం అక్కాయిపాలెంలో జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బలరాం  హాజ రుకాగా ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి రామారావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నియోజకవర్గంలో అశాంతి నెలకొని ఉందని, ప్రస్తుతం కొంతవరకు మార్పు వచ్చిందని, పూర్తిస్థాయి ప్రశాంతత కోసం 2024లో ఎమ్మెల్యేగా బలరాం ను గెలిపించుకోవాలని పాలేటి అన్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడెందుకంటూ పోతుల సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బలరాం క లగజేసుకుని వారిని వారించారు. ఆయా కార్యక్ర మాల్లో డాక్టర్‌ వరికూటి అమృతపాణి, జంజనం శ్రీనివాసరావు, గవిని శ్రీనివాసరావు, మించాల సా ంబశివరావు, తహసీల్దార్లు మహ్మద్‌హుస్సేన్‌,  కే ఎల్‌.మహేశ్వరరావు, చీరాల మండల ప్రత్యేక అధి కారి డాక్టర్‌ బేబిరాణి,  ఎంపీడీవో సాంబశివరావు, లబ్ధిదారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

 Updated Date - 2020-12-27T06:18:49+05:30 IST