-
-
Home » Andhra Pradesh » Prakasam » house flats
-
అర్హులందరికీ నివాస స్థలాలు
ABN , First Publish Date - 2020-12-06T05:35:50+05:30 IST
అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ నివాసస్థలం, పక్కాగృహం మంజూరు చేస్తామని ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డి అన్నారు

కందుకూరు, డిసెంబరు 5: అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ నివాసస్థలం, పక్కాగృహం మంజూరు చేస్తామని ఎమ్మెల్యే మానుగుంట మహీధర రెడ్డి అన్నారు. కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు ఈనెల 25న పంపిణీ చేయనున్న నివాస స్థలాలను లాటరీ పద్ధతిలో కేటాయించే కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాట్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలన్న ఉద్దేశంతో లాటరీపద్ధతిలో కేటాయించామని, ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈనెల 25న ప్లాట్లు అందజేస్తున్నామని తెలిపారు. అర్హత ఉండి నివాస స్థలం పొందనివారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకుంటే 3 నెలల్లోగా వారికి కూడా నివాస స్థలం అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్, తహసీల్దార్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.