1527 మంది లబ్ధిదారులు ఎంపిక
ABN , First Publish Date - 2020-12-11T06:01:33+05:30 IST
ఎర్రగొండపాలెం మండలంలో నివేశన స్థలాల పంపిణీ కోసం 1527 మంది లభ్దిదారులను రెవెన్యూ అధికారులు గుర్తించి ఎంపిక చేశారు.
ఎర్రగొండపాలెం, డిసెంబరు 10 : ఎర్రగొండపాలెం మండలంలో నివేశన స్థలాల పంపిణీ కోసం 1527 మంది లభ్దిదారులను రెవెన్యూ అధికారులు గుర్తించి ఎంపిక చేశారు. ఈనెల 25న నివేశస్థలాల పంపిణీ కోసం పట్టాలు సిద్ధం చేశామని డిప్యూటీ తహీల్దారు వీ.వీరయ్య గురువారం తెలిపారు. మండలంలోని అమాని గుడిపాడులో 27 మంది, బోయలపల్లి 85 మంది, గంగాపాలెం 39, గంజివారిపల్లె 35, గోళ్ళవీడపి 13, గురిజేపల్లి 22, గుర్రపుసాల 19 , కాశీకుంటతాండ 41, కొలుకుల 66, మిల్లంపల్లి 67, మొగుళ్ళపల్లి 5, నరసాయపాలెం 41, వాదంపల్లి 62, వీరభధ్రాపురం 95, ఎర్రగొండపాలెం 910 మంది లబ్ధిదారులను గుర్తించి పట్టాలు సిద్ధం చేసినట్లు తెలిపారు.