స్థలాలు కేటాయించాలని నిరసన

ABN , First Publish Date - 2020-12-25T05:42:35+05:30 IST

తమకు హక్కు కలిగిన ఇంటి స్థలాలు తమకే కేటాయించాలని మండలంలోని బాదాపురం గ్రామస్థులు గురువారం సాయంత్రం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

స్థలాలు కేటాయించాలని నిరసన
ఆందోళన చేస్తున్న బాదాపురం గ్రామస్థులు


దొనకొండ, డిసెంబరు 24 : తమకు హక్కు కలిగిన ఇంటి స్థలాలు తమకే కేటాయించాలని మండలంలోని బాదాపురం గ్రామస్థులు గురువారం సాయంత్రం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. బాదాపురం గ్రామానికి చెందిన సర్వేనెంబర్లు 109, 110/2 లోని భూమిలో 1984లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో గ్రామానికి చెందిన కొందరికి ఇళ్లప్లాట్లు వేసి ఇంటి పట్టాలు అందించారు. అయితే నాటి నుంచి నేటి వరకు అధికారులు నిర్లక్ష్యం కారణంగా వారికి ప్లాట్లకు చెందిన హద్దులు చూపించలేదు. దీంతో లబ్ధిదారులకు గతం లో మంజూరైన పక్కా గృహలు సైతం వెన క్కు వెళ్లాయి. దీంతో ప్రస్తుతం చాలామందికి సరైన ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు వాపోయారు. గ్రామంలో సరైన ఇళ్లు లేక తాము ఇబ్బందులు పడుతుంటే తమకు చెందిన  ఇంటి స్థలం మరొక గ్రామానికి చెందిన వారికి కేటాయించడం ధారుణమని ఆవేదనలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంటి పట్టాల పంపిణీ జరగకముందే వేరే గ్రామానికి చెందిన కొందరు తమకు హక్కు కల్గిన ప్లాట్లలో ఈ ప్లాటు ‘మాదంటే మాదంటూ’ గుంతలు తీస్తున్నారని ఆరోపించారు. తమ పరిస్థితి గుర్తించి తమకు హక్కు కల్గిన ఇళ్లస్ధలాలు తమకే కేటాయించాలని తహసీల్దార్‌కు వారు విజ్ఞప్తి చేశారు. అందుకు స్పందించిన తహసీల్దార్‌ వె.వెంకటేశ్వరరావు ఆ భూమిలో మొత్తం 290 ప్లాట్లకు గాను ప్రస్తుతం 150 మంది లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేశామన్నారు. గతంలో ఇళ్లపట్టాలు పొందిన వారు అర్హులై ఉంటే విచారించి తప్పనిసరిగా వారికి ఇళ్లపట్టాలు మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు. 

Updated Date - 2020-12-25T05:42:35+05:30 IST