టీడీపీ పరిశీలకులుగా కరిముల్లా

ABN , First Publish Date - 2020-11-22T05:08:06+05:30 IST

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో గూడూరు నియోజకవర్గానికి టీడీపీ పరిశీలకులుగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి షేక్‌ కరిముల్లాను నియమించారు.

టీడీపీ పరిశీలకులుగా కరిముల్లా


 ఎర్రగొండపాలెం, నవంబరు 21 : తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో  గూడూరు నియోజకవర్గానికి టీడీపీ పరిశీలకులుగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి షేక్‌ కరిముల్లాను నియమించారు. రాష్ట్ర టీడీపీ అధిష్ఠానం నుంచి నియామక ఉత్తర్వులు అందాయని శనివారం సాయంత్రం కరిముల్లా తెలిపారు. రాష్ట్ర అధినాయకత్వం తనపై ఉంచిన బాధ్యతకు శక్తివంచన లేకుండా న్యాయం చేస్తానన్నారు. గూడూరు నియోజకవర్గంలో టీడీపీకి ఎక్కువ ఓట్లు పోలయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు. తిరుపతిపార్లమెంటు టీడీపీ అభ్యర్ధి పనబాకలక్ష్మీ విజయానికి శ్రమిస్తానని తెలిపారు.

Read more