హోం క్వారంటైన్‌కు వైద్యుడు
ABN , First Publish Date - 2020-04-25T10:36:50+05:30 IST
రావినూతలకు చెందిన ప్రైవేటు నర్సింగ్ హోం డాక్టరును హోం క్వారంటైన్‌కు తరలించారు.

మేదరమెట్ల, ఏప్రిల్ 24: రావినూతలకు చెందిన ప్రైవేటు నర్సింగ్ హోం డాక్టరును హోం క్వారంటైన్‌కు తరలించారు. గ్రామానికి చెందిన వృద్ధునికి నెల్లూరులో పాజిటి వ్ వచ్చింది. దీంతో అతను చికిత్స పొందిన నర్సింగ్ హోం డాక్టరు, సిబ్బందిని ఈనెల 17న ఒంగోలు క్వారంటైన్‌కు తరలించారు. డాక్టరుకు పరీక్షల నిర్వహించి నెగటివ్ రావడంతో శుక్రవారం హోం క్వారంటైన్‌కు పంపించారు.
రావినూతలలో మరొకరికి పాజిటివ్
కొరిశపాడు మండలంలోని రావినూతలలో మరో యువతికి కరోనా పాజిటివ్ వచ్చింది. చిరు ఉద్యోగి భార్య అయిన ఆమె కొద్దిరోజులుగా ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నది. ఈ నెల 17న గ్రామానికి చెందిన వృద్ధునికి నెల్లూరులో కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన 20 మందిని క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహించారు. వీరిలో సదరు మహిళకు పాజిటివ్ వచ్చిందని అధికారులు ధ్రువీకరించారు. గ్రామాన్ని దర్శి డీఏస్పీ కె.ప్రకాశరావు, అద్దంకి సీఐ అశోక్‌వర్ధన్, ప్రత్యేక అధికారి తాతారావు, తహసీల్దార్ చంద్రావతి, ఎంపీడీవో సాయికుమారి, వైద్యాధికారులు శశికళ, రామకృష్ణ సందర్శించారు.