హిందువులు సంఘటితంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-03-02T10:48:34+05:30 IST

హిందువుల సంఘటితంగా ఉండి అన్యమతస్థుల దాడులను తిప్పికొట్టాలని వీహెచ్‌పీ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి యక్కలి రాఘవులు అన్నారు.

హిందువులు సంఘటితంగా ఉండాలి

మార్కాపురం, మార్చి 1: హిందువుల సంఘటితంగా ఉండి అన్యమతస్థుల దాడులను  తిప్పికొట్టాలని వీహెచ్‌పీ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి యక్కలి రాఘవులు అన్నారు. పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు సమీపంలోని కాశీనాయన ఆశ్రమంలో ఆదివారం వీహెచ్‌పీ జిల్లా సమావేశం జరిగింది.


ముఖ్యఅతిథిగా హాజరైన రాఘవులు మాట్లాడుతూ ఢిల్లీ, బైంసా, నెల్లూరు తదితర ప్రాంతాల్లో హిందువులపై అన్యమతస్తులు చేస్తున్న దాడులను ఆయన ఖండించారు. అందరూ కలిసి కట్టుగా ఉండాలని హిందూ ధర్మం కోరుకుంటుందన్నారు. ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రాణేష్‌ మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు వీరరావు, వెంకట్‌రెడ్డి, నారాయణరెడ్డి, అపర్ణ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-02T10:48:34+05:30 IST