కొండ ఎక్కగలరా..?

ABN , First Publish Date - 2020-12-20T05:02:02+05:30 IST

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

కొండ ఎక్కగలరా..?పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈనెల 25న పట్టాల పంపిణీకి నిర్ణయించింది. అందుకోసం అధికారులు స్థలాలను గుర్తించి లేఅవుట్లు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కొన్ని చోట్ల ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొండలు, గుట్టలు, లోతట్టు ప్రాంతాల్లో లేఅవుట్లు ఏర్పాటు చేయడంపై లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద ఏకంగా కొండపైనే రెండు ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. దేవరాజుగట్టు, శివాపురం గ్రామాలకు చెందిన 120 మందికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు హద్దురాళ్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే అంత ఎత్తు ఎక్కి అక్కడ నివాసం ఉండలేమని లబ్ధిదారులు అంటున్నారు. 

 - మార్కాపురం


Read more