-
-
Home » Andhra Pradesh » Prakasam » high pressere in bangalakhaatam
-
సముద్రం అల్లకల్లోలం !
ABN , First Publish Date - 2020-11-25T05:36:14+05:30 IST
నివర్ తుపా ను దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీరం దాటే సమయంలో జిల్లాలోని 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది.

తీర ప్రాంత మండలాలకు ప్రత్యేకాధికారులు
కంట్రోల్ రూం ఏర్పాటు
టోల్‌ఫ్రీ నంబర్ 1077
ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసు, మెరైన్ పోలీసులు
ఒంగోలు నగరం, నవంబరు 24: నివర్ తుపా ను దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీరం దాటే సమయంలో జిల్లాలోని 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది. నివర్ కారణంగా ఎ లాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకునేందుకు జిల్లాలో 11 తీర ప్రాంత మండలాలకు క లెక్టర్ పోలా భాస్కర్ ప్రత్యేక అధికారులను ని యమించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత మండలాల తహసీల్లార్లు, ఇతర రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పు డు సమీక్షించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నంబర్ 1077ను అం దుబాటులో ఉంచారు. తుపాను కారణంగా మం గళవారం సముద్రం అల్లకల్లోలంగా కనిపించింది. తీరం వెంట చలితో కూడిన ఈదురుగాలులు వీచాయి. అలలు ఎగిసిపడుతూ ఉండటంతో మ త్స్యకారులు తమ పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. పెద్దపెద్ద పడవలకు సముద్రంపైనే లంగర్ వేసి సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసు కున్నారు. వేటకు వెళ్లకుండా రెవెన్యూ అధికారు లు తీరం వద్ద నిఘా ఉంచారు. పోలీసు, మెరైన్ పోలీసులను కూడా తీర ప్రాంత ప్రజలను అప్ర మత్తం చేశారు.
అప్రమత్తంగా ఉండాలి : సీఎం
ఒంగోలు(కలెక్టరేట్): నివర్ తుపాను ప్రభా వం కారణంగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి మంగళవారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వ హించిన వీడియో కాన్పరెన్స్‌లో ఆదేశించారు. తుఫాను ప్రభావం నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా బుధవారం సాయంత్రం ను ంచి 26వ తేదీ వరకు ఉంటుందని ఆయన చె ప్పారు. కోస్తాతీర ప్రాంత జిల్లాల్లో 11నుంచి 20 సెంటీమీటర్ల వర్షాలు పడే అవకాశం ఉందని తె లిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ కలెక్టరేట్, డివిజన్, మండలాల్లో కంట్రోలు రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 11మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు సీఎం దృష్టికి తీసుకెళ్ళారు. కార్యక్రమంలో జేసీలు వెంకటమురళీ, చేతన్, ఎస్పీ సిద్ధార్థకౌశల్, డీఆ ర్వో వినాయకం, సబ్‌కలెక్టర్ భార్గవ్ తేజ, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.