ఆరోగ్య కేంద్రం తనిఖీ

ABN , First Publish Date - 2020-12-06T06:35:33+05:30 IST

ఎర్రగొండపాలెం సామాజిక ఆరోగ్యకేంద్రాన్ని శనివారం జిల్లా వైద్యాధికారి రత్నావలి తనిఖి చేశారు.

ఆరోగ్య కేంద్రం తనిఖీ

 ఎర్రగొండపాలెం, డిసెంబరు 5 : ఎర్రగొండపాలెం సామాజిక ఆరోగ్యకేంద్రాన్ని శనివారం జిల్లా వైద్యాధికారి రత్నావలి తనిఖి చేశారు. సామాజిక ఆరోగ్యకేంద్రంలో ప్రతి నెల గర్భిణులకు నిర్వహించే పరీక్షలుపై వైద్యసిబ్బందితో సమీక్షించారు. గర్భిణులకు పోషకాహారంపై అవగాహన కల్పించాలని వైద్యులకు సూచనలు చేశారు. డెలివరి సమయంలో ప్రతి గర్భిణీ సాధారణ కాన్పు వైద్యశాలలో జరిగే విధంగా వైద్యులు చికిత్సలు నిర్వహించాలని సూచించారు. ఆరోగ్యకేంద్రంలో ఉన్న ఆరోగ్యమిత్ర హెల్ప్‌డె్‌స్కను పరిశీలించారు. స్థానిక డాక్టర్లుపాల్‌, శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌, సూర్యనాయక్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T06:35:33+05:30 IST