-
-
Home » Andhra Pradesh » Prakasam » heavy rain in ongole
-
ఒంగోలులో జోరువాన
ABN , First Publish Date - 2020-11-27T06:02:48+05:30 IST
నివర్ తుఫాను ప్రభా వంతో ఒంగోలు నగరం తడిసి ముద్దయింది. బుధివారం సా యంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టితో జన జీవనం స్తంభించిపోయింది.

శివారు కాలనీలు జలదిగ్బంధం
ఒంగోలు (కార్పొరేషన్) నవంబరు 26 : నివర్ తుఫాను ప్రభా వంతో ఒంగోలు నగరం తడిసి ముద్దయింది. బుధివారం సా యంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టితో జన జీవనం స్తంభించిపోయింది. రోడ్లు చెరువును తలపించాయి. ఇందిరాకాలనీ, గుర్రం జాషువా కాలనీ, మదర్ థెరిస్సా కాలనీ, నెహ్రూ నగర్, బలరాం కాలనీ, కేశవరాజు కుంట, నేతాజీకాలనీ, వెంకటేశ్వర కాలనీ, శ్రీరామ్ కాలనీ, ప్రగతి కాలనీ, బిలాల్ నగర్, కరుణా కాలనీ, కొప్పొలు రోడ్‌లోని జర్నలిస్ట్ కాలనీ, ఎన్టీఆర్ కా లనీలలో వర్షపు నీరు నిలిచిపోవడంతో జనం ఇళ్ళ నుంచి బయ టకు రాలేని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కర్నూలురోడ్, ఆర్టీసీ డిపో, రిమ్స్ ఆసుపత్రి ఎదురు, భాగ్యనగర్, దారావారితోట, పాత మార్కెట్ సెంటర్‌లో భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వానకు తోడు ఈదురు గాలులు తోడవడంతో చలి తీవ్రంగా పెరగడంతో ప్రజ లు ఇబ్బందిపడ్డారు. కాగా కార్పొరేషన్ కమిషనర్ భాగ్యలక్ష్మి, ఎం ఈ డి.సుందరరామిరెడ్డి, అసిస్టెంట్ కమిషనరు కె.మోహన్‌రావు పలు ప్రాంతాల్లో పర్యటించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.