కరోనాతో పోరాడి ఓడిన హెడ్‌ కానిస్టేబుల్‌

ABN , First Publish Date - 2020-08-12T11:30:04+05:30 IST

కరోనాతో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ పోరా డి తుది శ్వాస విడిచాడు. ఐటీ కోర్‌ టీమ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయన ..

కరోనాతో పోరాడి ఓడిన హెడ్‌ కానిస్టేబుల్‌

ఒంగోలు(క్రైం), ఆగష్టు 11: కరోనాతో  ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ పోరా డి తుది శ్వాస విడిచాడు. ఐటీ కోర్‌ టీమ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయన రిమ్స్‌లో మంగళవారం మృతి చెందాడు. ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ స్థానిక పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో అమరవీరుల స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబసభ్యులను ఎస్పీ ఓదార్చి పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మార్కాపురం ఓఎస్‌డీ కె.చౌడేశ్వరి, ఎస్‌బీ డీఎస్పీ టీవీవీ ప్రతాప్‌కుమార్‌, ఏవో సులోచన, ఎస్బీ-2 ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీకాంత్‌బాబు, సీఐలు ఎం.బీమానా యక్‌, ఎంలక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు


వెలిగండ్ల: మండలంలోని పందువ నాగులవరానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఇతనికి సోమవారం చేసిన పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో కందుకూరులోని మలినేని కాలేజీకి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున శ్వాస అందక మృతి చెందినట్లు వై ద్యశాఖ సిబ్బంది చెప్పారు. 

Updated Date - 2020-08-12T11:30:04+05:30 IST