రైతులు పండించిన ఉత్పత్తులు కొనుగోలు

ABN , First Publish Date - 2020-05-09T09:07:38+05:30 IST

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట ఉ త్పత్తులు కొనుగోలు చేయాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌

రైతులు పండించిన ఉత్పత్తులు కొనుగోలు

కలెక్టర్‌ పోలా భాస్కర్‌


ఒంగోలురూరల్‌, మే 8 : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట ఉ త్పత్తులు కొనుగోలు చేయాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు.  శుక్రవారం ఒంగోలు ఏఎంసీ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావంతో రైతులు  ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. వరిధాన్యం, మొక్కజొన్న, జొన్న, కందులు, శనగలు వివిధ సంస్థలు బాధ్యతగా కొనుగోలు చేయాలన్నారు. అంతేగాకుండా వారికి గిట్టుబాటు ధరలు వచ్చేలా చేయాలని సూచించారు.


జిల్లాలోని ఆయా కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. వైఎస్సార్‌ జనతాబజార్‌ల ద్వారా ప్రజలకు కావాల్సిన కూరగాయలు కిట్లు పెద్ద ఎత్తున పంపిణీ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ కోఠారి రామచంద్రరావు, జేసీ షన్మోహన్‌, జేడీఏ శ్రీరామమూర్తి,  ఏపీఎంఐపీ పీడీ రవీంద్రబాబు, డీఆర్‌డీఏ పీడీ ఎలీషా, ఏడీకే ఉపేంద్రకుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-09T09:07:38+05:30 IST