-
-
Home » Andhra Pradesh » Prakasam » Handover of Pension Distribution
-
పింఛన్ పంపిణీలో చేతివాటం
ABN , First Publish Date - 2020-06-22T10:52:44+05:30 IST
వృద్ధాప్య పింఛన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగి, వలంటీర్ కుమ్మక్కై చేతివాటం చూపించాడు. రూ.2,250 రావాల్సిన వృద్ధాప్య పింఛన్‌ను

రూ. 2250గాను.. రూ. 500లే అందజేత
ఉలవపాడు, జూన్ 21 : వృద్ధాప్య పింఛన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగి, వలంటీర్ కుమ్మక్కై చేతివాటం చూపించాడు. రూ.2,250 రావాల్సిన వృద్ధాప్య పింఛన్‌ను రూ.500 వచ్చిందంటూ ప్రతి నెలా వృద్ధురాలి చేతిలో పెట్టేవారు. ఐదు నెలల గడిచిన తరువాత విషయం బయటపడడంతో నీళ్లు నమలడం వారివంతైంది. బాధితుల వివరాల మే రకు... కరేడు పంచాయతీ పెద్దపల్లెపాలెంలోని గొల్లపోతు మీరమ్మకు, ఆమె భర్తకు గత ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పింఛన్ వస్తుండేది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక రేషన్ కార్డుకు ఒకరే అర్హులు కావడంతో వీరమ్మను అభయహస్తం కిందకు మార్చి ప్రతి నెల రూ.500 అందేలా చేయాలని అధికారులు ప్రయత్నించారు. ఆమె ఎప్పటిలాగే వృద్ధాప్య పింఛన్ కోటాలోనే నగదు వస్తోంది.
ఈ విషయాన్ని దాచి పెట్టి సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వలంటీర్ కలిసి ఆమెకు రూ. 500లే అందించేవారు. మిగిలిన రూ.1,750లను వీరిద్దరూ పంచుకునేవారు. ఐదు నెలల గడిచిన తరువాత వీరమ్మ కుమారుడికి అనుమానం వచ్చి అసలు విషయం కనుక్కోవడంతో వారి గుట్టురటైంది. ఇదిలా ఉంటే... అవినీతి పాల్పడిన సచివాలయం ఉద్యోగికి, వలంటీర్‌కు పంచాయతీ కార్యదర్శి, స్థానిక వైసీపీ నాయకుడు అండదండలున్నట్లు ప్రజలు చెబుతున్నారు.