చేనేత పింఛన్ల మంజూరుపై విచార ణ

ABN , First Publish Date - 2020-06-19T10:56:10+05:30 IST

చేనేతలు కాని వారికి పింఛన్లు మంజూరు చేసిన విషయమై గురువారం సీఈవో సాయికుమారి విచారణ చేపట్టారు. బల్లికురవ మండలంలోని పలు

చేనేత పింఛన్ల మంజూరుపై విచార ణ

బల్లికురవ, జూన్‌ 18 : చేనేతలు కాని వారికి పింఛన్లు మంజూరు చేసిన విషయమై గురువారం సీఈవో సాయికుమారి విచారణ చేపట్టారు. బల్లికురవ మండలంలోని పలు గ్రామాలలో ఈ ఏడాది ఫిబ్రవరిలో చేనేతలు కాని 25 మందికి పింఛన్లు మంజూరు చేశారు. దీనిపై అప్పట్లో  ఎంపీడీవో కార్యాలయ టైపిస్టు వెంకటేశ్వర్లును ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. పూర్తి స్థాయి విచారణకు కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు.


జడ్పీ సీఈవో కైలాష్‌ గిరీశ్వర్‌ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఈవో సాయికుమారి మండల పరిషత్‌ కార్యాలయంలో  పింఛన్‌ కోసం అర్జీలు ఎలా పెట్టారు, అందుకు ఎవరు బాధ్యత వహించారు అన్నదానిపై పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో, టైపిస్టు, ఈవోపీఆర్డీల నుంచి లిఖిత పూర్వక వివరణ సేకరించారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు పంపుతామని తెలిపారు. ఆమెతోపాటు ఎంపీడీవో శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ వెంకటస్వామి పాల్గొన్నారు.  

Updated Date - 2020-06-19T10:56:10+05:30 IST