గ్రామాభివృద్ధి ప్రణాళిక కోసం గ్రామసభలు

ABN , First Publish Date - 2020-11-26T05:59:27+05:30 IST

మండలకేంద్రం త్రిపురాంతకంలో ఈవోఆర్డీ జె.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి ప్రణాళిక గ్రామ సభను బుధవారం నిర్వహించారు.

గ్రామాభివృద్ధి ప్రణాళిక కోసం గ్రామసభలు
త్రిపురాంతకం సభలో మాట్లాడుతున్న ఈవోఆర్‌డీ


త్రిపురాంతకం, నవంబరు 25 : మండలకేంద్రం త్రిపురాంతకంలో ఈవోఆర్డీ జె.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి ప్రణాళిక గ్రామ సభను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు సచివాలయ సిబ్బందితో ఈవోఆర్డీ పలు అంశాలపై చర్చించారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి ఏడుకొండలు, ఏపీఎం కృపమ్మ, వీఆర్వోలు శివలింగయ్య, వెంకటలక్ష్మీ, వలంటీర్లు పాల్గొన్నారు.

పెద్దారవీడు : మండలంలోని తోకపల్లి గ్రామ అభివృద్ధికి ముందస్తుగా ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని పంచాయితీ కార్యదర్శి మోహన్‌రావు కోరారు. బుధవారం తోకపల్లి గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని ప్రసంగించారు. 2021-22 పంచాయితీ అభివృద్ధి ప్రణాళికపై పంచాయితీ కార్యదర్శి వివరించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన రోడ్లు, సైడ్‌ కాలువలు, మురుగు తొలిగింపు, శానిటేషన్‌ తదితర అంశాలపై ప్రణాళిక తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

రాచర్ల : పాలకవీడు పంచాయతీ, గ్రామాల అభివృద్ధి గురించి ప్రణాళికలు తయారు చేయాలని ఎంపీడీవో సయ్యద్‌ మస్తాన్‌వలి అన్నారు. బుధవారం పాలకవీడు గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. జనవరి నుంచి ప్రభుత్వం ఇంటింటికి రేషన్‌ పంపిణీ చేస్తున్న దృష్ట్యా నాలుగు వాహనాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అహల్యరాణి, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. 


రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మృతి

త్రిపురాంతకం, నవంబరు 25 : ద్విచక్రవాహనం అదుపుతప్పి విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మృతి చెందాడు. పుల్లలచెరువు మండలం మానేపల్లికి చెందిన గంగుమాల జేసుదాసు(68) మరోవ్యక్తితో కలిసి బుధవారం మార్కాపురం వెళ్లి తిరిగి వస్తున్నాడు. కేశినేనిపల్లి సమీపంలో ఎదు రుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కిందపడిపోయారు. ఈప్రమాదంలో జేసుదాసుకు తీవ్రగాయాలు కాగా  మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గం మద్యలో మృతి చెందాడు. బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-11-26T05:59:27+05:30 IST