లెక్క లేని దోపిడీ.. గ్రామ పంచాయతీల్లో పెచ్చరిల్లిన అవినీతి
ABN , First Publish Date - 2020-10-21T17:49:32+05:30 IST
గ్రామ పంచాయతీల్లో పాలన గాడితప్పింది. అవినీతి పెచ్చరిల్లింది. ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు కుమ్మక్కై నిధులను బొక్కేస్తున్నారు...

అధికారుల పాలనలో ఇష్టారీతిన నిధుల దుర్వినియోగం
తవ్వేకొద్ది బయటపడుతున్న అక్రమాలు
ఫిర్యాదులు వచ్చిన పంచాయతీల్లో లక్షల్లో స్వాహా
ఇప్పటికే నలుగురు కార్యదర్శులు, ఒక జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
మరికొందరిపై కొనసాగుతున్న విచారణ
వారిలో కొందరిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకునే అవకాశం
ఒంగోలు: గ్రామ పంచాయతీల్లో పాలన గాడితప్పింది. అవినీతి పెచ్చరిల్లింది. ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు కుమ్మక్కై నిధులను బొక్కేస్తున్నారు. ‘ప్రత్యేక’ పరిస్థితులు కూడా వారికి బాగా కలిసొచ్చాయి. పాలకవర్గాలు లేకపోవడం, పర్యవేక్షణ చేసేవారు కరువవడంతో ఇదే అదనుగా స్వాహా పర్వానికి తెరలేపారు. లెక్కాపక్కా లేకుండా నిధులను మింగేస్తున్నారు. ఖర్చుపెట్టేది, మంజూరు చేసుకునేది వారే కావడంతో ఇష్టారాజ్యంగా మారింది. ఇప్పటికే అవినీతి ఆరోపణల కారణంగా జిల్లాలో నలుగురు కార్యదర్శులు, ఒక జూనియర్ అసిస్టెంట్‌పై వేటుపడింది. ఇంకా కొన్ని పంచాయతీల్లో విచారణ సాగుతోంది. మరి పల్లె పాలనను పట్టించుకునేవారెవరో...!
గ్రామ పంచాయ తీల్లో అధికారుల పాలన అవినీతి పుట్టగా మారింది. అక్ర మాలు జరిగినట్లు వచ్చిన పంచాయతీల్లో విచారణ చేస్తే ఒక్కో చోట రూ. 12లక్షల నుంచి రూ.18లక్షల వరకూ నిధు లు దారిమళ్లినట్లు తేలింది. 2018 ఆగస్టు 1వ తేదీ నాటికి గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగి యడంతో ఆ మరుసటి రోజు నుంచి అధికారుల పాలనలోకి వచ్చాయి. ఆయా పంచాయతీలకు మండల స్థాయిలోని అధి కారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్య దర్శులు ఇష్టానుసారంగా నిధులను డ్రా చేసి సొంతంగా వా డుకోవడం ప్రారంభించారు. అనేక చోట్ల నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
లక్షల్లో డ్రా.. బిల్లులు నిల్
పంచాయతీల నుంచి డ్రా చేసే నిధులకు పక్కా లెక్కలు ఉండాలి. కానీ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిసు ్తన్నారు. పంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడంతో ఆ నిధు లు దేనికి వినియోగించారో కూడా తెలియని పరిస్థితి ఏర్ప డింది. సాధారణంగా పంచాయతీ నిధులు వినియోగిస్తే అందుకు సంబంధించిన బిల్లులను సమర్పించి సంబంధిత అధికారి ద్వారా ఆమోద ముద్ర వేయించుకోవాలి. కానీ అం దుకు భిన్నంగా నిధులు ఖర్చు చేసినట్లు చూపించి రికార్డుల్లో మాత్రం నమోదు చేయని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ నిధులకు లెక్కాపక్కా లేకుండా పోయింది.
నిధుల డ్రాకు ఆమోదం....
పంచాయతీల్లో పాలక వర్గాలు లేకపోవడంతో నిధులను సులువుగా డ్రా చేసుకుంటున్న పంచాయతీ ప్రత్యేకాధికా రులు, కార్యదర్శులు ఇష్టారీతిన ఖర్చు చేస్తున్నారు. ఆవిధంగా అనేక పంచాయతీల్లో నిధులను డ్రాచేసి అక్రమాలకు పాల్పడ్డారు. ఆయా నిధుల అక్రమాలపై ఏడెనిమిది పంచా యతీల అధికారులపై స్థానికులు ఫిర్యాదులు చేయడంతో జిల్లా పంచాయతీ అధికారి సమగ్ర విచారణకు ఆదేశించారు. అందులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా పంచాయతీల్లో రూ.80లక్షల నిధులు దుర్వినియోగం అయినట్లు వెల్లడైంది. కొంతమంది పంచాయతీల్లో ఉండే నిధులను డ్రా చేసి కనీసం లెక్కల్లో చూపించలేదని తేలింది. మరికొన్ని పంచాయతీల్లో ని ధులతో పాటు గ్రామాల్లో వివిధ రకాల పన్నుల ద్వారా వసూలు చేసిన డబ్బులను కూడా పంచాయతీ అకౌంట్లలో జమ చేయకుండా ఇష్టానుసారంగా వాడుకున్నారు. డ్రా చేసిన నిధులకు సంబంధించిన వివరాలను కనీసం పంచాయతీ రికార్డుల్లో కూడా నమోదు చేయకపోవడం చూసి విచారణ అధికారులు అవాక్కయ్యారు. ఇప్పటికే కరేడు, సింగరాయ కొండ, దేశాయిపేట, బిట్రగుంటల్లో పూర్వ పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది. ఉప్పుగుండూరు పంచాయతీలో సుమారు రూ.20లక్షల వరకు స్వాహా కావ డంతో ఇప్పటికే జూనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేయగా పంచాయతీ కార్యదర్శిపై ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు.
తవ్వేకొద్దీ అక్రమాలు
గత రెండేళ్లలో పంచాయతీలకు సంబంధించి డ్రా చేసిన నిధులపై ఫిర్యాదులు వచ్చిన పంచాయతీల్లో విచారణ చేస్తే తవ్వేకొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. నిధులను డ్రా చేయడంతో పాటు వివిధ పన్నుల కింద ప్రజల నుంచి వసూలే చేసిన డబ్బులను కూడా పంచాయతీ అకౌంట్లలో జమ చేయని పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా జిల్లాలోని అనేక పంచాయతీల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఫిర్యాదులపై సమగ్ర విచారణ
గ్రామపంచాయతీల్లో నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు వస్తే సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నాం. ఆవిధంగా ఇప్పటికే కరేడు, సింగరాయకొండ, దేశాయిపేట, కె.బిట్రగుంట కార్యదర్శులను సస్పెండ్ చేశాం. ఉప్పుగుండూరు పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేయగా, కార్యదర్శిపై నివేదికను సమర్పించాం. పంచాయతీల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై సమగ్ర విచారణ చేసి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం.
- జి.వి. నారాయణరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి