దివ్యాంగులకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2020-12-04T04:51:24+05:30 IST

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం ఉంటుందని వైసీపీ ని యోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య తెలి పారు. గురువారం బల్లికురవలోని వెలుగు కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యాంగుల ది నోత్సవం జరిగింది.

దివ్యాంగులకు అండగా ఉంటాం
దివ్యాంగుల గ్రూపులకు చెక్కులను అందజేస్తున్న బాచిన కృష్ణచైతన్య


నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణచైతన్య 


బల్లికురవ, డిసెంబరు 3 : దివ్యాంగులకు అండగా ప్రభుత్వం ఉంటుందని వైసీపీ ని యోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య తెలి పారు. గురువారం బల్లికురవలోని వెలుగు కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యాంగుల ది నోత్సవం జరిగింది. ఈ సందర్భంగా 15 ది వ్యాంగ గ్రూపులకు రూ.30లక్షల రుణాలు, స దరం సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులు, బస్సు పాసులను ఆయన పంపిణీ చేశారు. దివ్యాం గులకు ఇళ్ల స్థలాలు, సంఘ భవనాల నిర్మా ణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనం తరం సంఘ అధ్యక్షుడు అంజియ్యను సత్కరి ంచారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ చింతల పేరయ్య చౌదరి, తహసీల్దార్‌ అశోక్‌వర్ధన్‌, ఎంపీడీవో యార్లగడ్డ శ్రీనివాసరావు, వెలుగు ఏరియా కోఅర్డినేటర్‌ సుభాషిణి, ఏపీఎం జ్యోతి ప్రసాదబాబు, ఎం ఈవో వీరరాఘవయ్య, ఏవో కుమారి, హెచ్‌ ఎం రవీంద్రబాబు పాల్గొన్నారు.  


Updated Date - 2020-12-04T04:51:24+05:30 IST