కబడ్డీలో గిద్దలూరు విద్యార్థికి బంగారు పతకం
ABN , First Publish Date - 2020-12-20T06:08:36+05:30 IST
హర్యానా రాష్ట్రంలోని పానీపట్టులో జరిగిన అండర్-17 విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున గిద్దలూరు విద్యార్ధి బంగారు పతకం సాధించాడు.

గిద్దలూరు టౌన్, డిసెంబరు 19 : హర్యానా రాష్ట్రంలోని పానీపట్టులో జరిగిన అండర్-17 విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున గిద్దలూరు విద్యార్ధి బంగారు పతకం సాధించాడు. ఈనెల 12, 13, 14 తేదీలలో జరిగిన కబడ్డీ పోటీల్లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మీరంపల్లి కిరణ్ అనే విద్యార్ధి ప్రథమ స్థానంలో గెలుపొంది బంగారు పతకం సాధించాడు. శనివారం జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన అభినందన సభ ప్రధానోపాధ్యాయుడు సిద్దేశ్వరశర్మ అద్యక్షతన జరుగ్గా మండల విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్ధిని అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.