బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద గంజాయి పట్టివేత?
ABN , First Publish Date - 2020-12-12T04:01:48+05:30 IST
మార్టూరు మండల పరిధిలోని జాతీయరహదారిపై బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం వేకువజామున పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నెల్లూరుకు తరలింపు
దాదాపు 200 కిలోలకుపైగా ఉన్నట్లు పోలీసుల అంచనా
మార్టూరు, డిసెంబరు 11 : మండల పరిధిలోని జాతీయరహదారిపై బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం వేకువజామున పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా తుని నుంచి నెల్లూరుకు బొలారో కారులో గంజాయి తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. వాహనాన్ని తనిఖీ చేయగా భారీగా గంజాయి ఉంది. దాదాపు 200 కిలోలకు పైగా గంజాయి ఉన్నట్లు తెలిసింది. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని స్థానిక పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. వారిద్దరు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంత మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.