పూనూరులో జోరుగా గంజాయి వ్యాపారం!

ABN , First Publish Date - 2020-11-16T01:13:08+05:30 IST

యద్దనపూడి మండల పరిధిలోని పూనూరులో గంజాయి వ్యాపారం మూడు పువ్వులు-ఆరుకాయలుగా కొనసాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

పూనూరులో జోరుగా గంజాయి వ్యాపారం!


యద్దనపూడి, నవంబర్‌ 15 : మండల పరిధిలోని పూనూరులో గంజాయి వ్యాపారం మూడు పువ్వులు-ఆరుకాయలుగా కొనసాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఓ వ్యక్తి చీరాల పరిసర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి గ్రామ శివారులో స్టాక్‌ పాయింట్ల ఏర్పాటు చేసుకుని అమ్మకాలు చేస్తుండగా, మరికొందరు గుంటూరు రైల్వేస్టేషన్‌ దగ్గర నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్నట్లు స్థానికులు తెలిపారు. గంజాయి ఒక్కో ప్యాకెట్‌ రూ.350కు అమ్ముతున్నారు. కొత్త వ్యక్తులకు ఆ ప్యాకెట్లు ఇవ్వకుండా తెలిసిన వ్యక్తులకే అమ్మకాలు చేస్తున్నారు. ఈ గంజాయిని మార్టూరు, బొబ్బేపల్లి, ఇంకొల్లు మండలాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పూనూరులో గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను యద్దనపూడి పోలీసులు పట్టుకోగా, పూనూరు గ్రామస్థాయి నాయకుడు ఫోన్‌ చేయడంతో స్టేషన్‌లో ద్వితీయశ్రేణి అధికారి వారిని వదలివేసినట్లు ఆరోపణలున్నాయి. 

Updated Date - 2020-11-16T01:13:08+05:30 IST