స్టోనాలో గెలాక్సీ ధగధగలు

ABN , First Publish Date - 2020-02-08T10:53:44+05:30 IST

బెంగళూరు అంతర్జాతీయ కేం ద్రంలో జరుగుతున్న స్టోనా -2020లో గెలాక్సీ గ్రానైట్‌ కాంతులీనుతోంది. గెలాక్సీ గ్రానైట్‌, జిల్లాలో దొరికే కలర్‌ గ్రానైట్‌

స్టోనాలో గెలాక్సీ ధగధగలు

చీమకుర్తి, ఫిబ్రవరి 7: బెంగళూరు అంతర్జాతీయ కేం ద్రంలో జరుగుతున్న స్టోనా -2020లో గెలాక్సీ గ్రానైట్‌ కాంతులీనుతోంది. గెలాక్సీ గ్రానైట్‌, జిల్లాలో దొరికే కలర్‌ గ్రానైట్‌ తో తయారు చేసిన వివిధరకాలఆకృతులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రానైట్‌రాయితో రూపొందించిన దశావతారాలతో విష్ణుమూర్తి విగ్రహం , షటిల్‌రాకెట్లు, వివిధ ఆకృతు లు అందరిని ఆకర్షిస్తున్నాయి.

కాగా స్టోనా లో రెండవరోజు శుక్రవారం కూడా విదేశీ బయ్యర్లు హాజరు అం తంత మాత్రంగానే ఉంది. చైనానుంచి ఒక్క బయ్యర్‌కూడా హాజ రు కాలేదు. టర్కీ, బంగ్లాదేశ్‌ లాంటి కొన్నిదేశాల నుంచే బయ్యర్లు హాజరయ్యారు. జిల్లా నుంచి ఏర్పాటు చేసిన పోకర్ణ, మిడ్వెస్టు, వీరభద్రా స్టాల్స్‌లో క్వారీ ప్రతినిధులు బయ్యర్లతో సంప్రదింపులు జరిపారు. యువ పారిశ్రామికవేత్త శిద్దా వీరవెంకట సుధీర్‌కుమార్‌, టి.బాలసుబ్బారావు, చంద్రారెడ్డి తదితరులు జిల్లా నుంచి పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-08T10:53:44+05:30 IST