కట్టుదిట్టంగా ట్రిపుల్‌ ఐటీ పరీక్షలు

ABN , First Publish Date - 2020-11-25T05:40:37+05:30 IST

జిల్లాలో ఈనెల 28న జరగనున్న ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షలు క ట్టుదిట్టంగా నిర్వహించాలని డీఈవో వీఎస్‌.సు బ్బారావు ఆదేశించారు.

కట్టుదిట్టంగా ట్రిపుల్‌ ఐటీ పరీక్షలు
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో సుబ్బారావునిమిషం లేటైనా నో ఎంట్రీ 

గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి 

డీఈవో సుబ్బారావు


ఒంగోలువిద్య, నవంబరు 24: జిల్లాలో ఈనెల 28న జరగనున్న ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షలు క ట్టుదిట్టంగా నిర్వహించాలని డీఈవో వీఎస్‌.సు బ్బారావు ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్ర కాశంభవనంలోని కలెక్టర్‌ సమావేశంహాలులో పరీక్షా కేంద్రాల చీఫీలు, డిపార్డుమెంట్‌ అధికారు లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా డీఈవో మాట్లాడుతూ ట్రిపుల్‌ ఐటీల్లో 2020-21  విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తొ లిసారిగా ఆర్‌జేయూకేటీ సెట్‌ -2020 ప్రవేశపరీ క్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎలాంటి మా ల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా ని ర్వహించాలని చెప్పారు. ఈ పరీక్షకు జిల్లాలో మొత్తం 7302 మంది విద్యార్థులు దరఖాస్తు చే సుకున్నారని, వీరికి అందుబాటులో ఉండేలా 59 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి నిమిషం లేటైనా అనుమతించబోమని డీఈవో స్ప్టష్టం చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని, గంట ముందుగా పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్‌ పరికరా ల అనుమతి నిషేధమన్నారు. హాల్‌టిక్కెట్‌ మీద ఫొటో లేకుంటే విద్యార్థి ఫొటో అంటించి తాను చదవిన పాఠశాల ప్రధానోపాధ్యాయుని సంతకం చేసి దాని చీఫ్‌ సూపరింటెండెంట్‌కు అందించాల ని సూచించారు. విద్యార్థికి సంబంధించిన ఓఎం   ఆర్‌ కార్బన్‌ కాపీని తీసుకెళ్ళేందుకు అనుమతి ఉందని తెలిపారు. 100మార్కులకు జరిగే ప్రవేశ పరీక్షకు గణితం 50 మార్కులు, పీఎస్‌ 25, బీఎ స్‌ 25 మార్కులకు ప్రశ్నలు ఉంటాయని డీఈవో వెల్లడించారు.


కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి 


ట్రిపుల్‌ఐటీ ప్రవేశ పరీక్షలో కొవిడ్‌ నిబంధ నలు తప్పనిసరిగా పాటించాలని డీఈవో ఆదేశిం చారు. మాస్కు ధరిస్తే పరీక్షా కేంద్రాల్లోకి అను  మతించాలన్నారు. పరీక్ష నిర్వహణ కోసం ఎస్‌ జీటీ, పీఈటీ, క్రాప్టు ఉపాధ్యాయులను మాత్రమే నియమించాలని చెప్పారు. సమావేశంలో ప్రభు త్వపరీక్షల సహాయ కమిషనర్‌ కె.శివకుమార్‌, డీసీఈబీ కార్యదర్శి డి.వెంకారెడ్డి, ఒంగోలు ఎంఈ వో టి.కిషోర్‌బాబు పాల్గొన్నారు.  


Read more