బైకును ఢీకొన్న ట్రాక్టర్‌.. స్నేహితుల దుర్మరణం

ABN , First Publish Date - 2020-12-27T06:57:49+05:30 IST

మృత్యువులోనూ వారు స్నేహబంధం వీడలేదు. కలిసి మెలిసి తిరిగిన వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఒకేసారి బలిగొంది.

బైకును ఢీకొన్న ట్రాక్టర్‌.. స్నేహితుల దుర్మరణం
రాజు, ఆమోష్‌ల మృతదేహాలు

పాతపాడు సమీపంలో ప్రమాదం 

గరిమినపెంట, వాలిచర్లలో విషాదం


కొనకనమిట్ల, డిసెంబరు 26 : మృత్యువులోనూ వారు స్నేహబంధం వీడలేదు. కలిసి మెలిసి తిరిగిన వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఒకేసారి బలిగొంది. ఈ సం ఘటన శనివారం రాత్రి మండలంలోని పాతపాడు సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గరిమినపెంట గ్రామానికి చెందిన రాజు (23), హనుమంతు నిపాడు మండలం వాలిచర్ల గ్రామానికి చెందిన నిశనం ఆమోష్‌ (24) స్నేహితులు. ఇద్దరూ కలిసి బేల్దారి పనులు చేస్తుంటారు. శనివారం వారు ద్విచక్ర వాహనంపై పొదిలి వెళ్లారు. అక్కడ సరదాగా షాపింగ్‌ చేశారు. అనంతరం గరిమినపెంటకు తిరుగు ప్రయా ణమయ్యారు.  పాతపాడు వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన రాజు, ఆమోష్‌ అక్కడికక్కడే మృతి చెందా రు. ట్రాక్టర్‌ రెండు డోర్లు తీసి ఉండటం, రాత్రి సమయం కావడంతో ట్రాక్టర్‌ హెడ్‌లైట్ల వె లుతురులో అవి కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావి స్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఎస్‌ఐ వెంకటేశ్వరనాయక్‌  సంఘటనా స్థలానికి  చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేశారు. 


Updated Date - 2020-12-27T06:57:49+05:30 IST