ఉచిత శిక్షణ
ABN , First Publish Date - 2020-11-14T02:47:47+05:30 IST
జీవనోపాధి మెరుగు పరచుకునేందుకు యువతీ యువకులకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి ఆర్.లోకనాథమ్ ఒక ప్రకటనలో తెలిపారు.
గిద్దలూరు, నవంబరు 13 : ఉపాధి సంబంధిత కోర్సులలో శిక్షణ పొంది జీవనోపాధి మెరుగు పరచుకునేందుకు యువతీ యువకులకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి ఆర్.లోకనాథమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎస్ ఆఫీసు, ట్యాలీ, క్లౌడ్ లిటరసీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఆన్‌డ్రాయిడ్, డిజిటల్ మార్కెటింగ్ తదితర కోర్సులలో అర్హతను బట్టి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఈనెల 23వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 8639015530, టోల్‌ఫ్రీ నెంబరు 18004252422 నంబర్లకు సంప్రదించాలన్నారు.