మాజీ ఎమ్మెల్యే తనయుడు మృతి
ABN , First Publish Date - 2020-12-07T17:22:16+05:30 IST
దివంగత మాజీ ఎమ్మెల్యే దప్పిలి పాండురంగారెడ్డి..

గిద్దలూరు: దివంగత మాజీ ఎమ్మెల్యే దప్పిలి పాండురంగారెడ్డి రెండవ కుమారుడైన మాజీ ఉపసర్పంచ్ దప్పిలి ప్రసాద్‌రెడ్డి (67) మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ప్రసాద్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రసాద్‌రెడ్డి మృతదేహాన్ని గిద్దలూరుకు తీసుకురాగా, సోమవారం అంత్యక్రియలు జరుగుతాయి. మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ పాలుగుళ్ళ ప్రతాపరెడ్డి, పలువురు టీడీపీ నాయకులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉపసర్పంచ్‌గా ఉన్న సమయంలో పంచాయతీ అభివృద్ధికి ప్రసాద్‌రెడ్డి చేసిన కృషిని పలువురు కొనియాడారు.