-
-
Home » Andhra Pradesh » Prakasam » FORMER HAPPY COUNTRY
-
అన్నదాత సంతోషంతోనే అంతా సుభిక్షం
ABN , First Publish Date - 2020-12-29T04:46:20+05:30 IST
అన్నదాత సంతోషంగా ఉంటేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు చెప్పారు.

రైతులు సంఘటితం కావాలి
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
మేము సైతం అంటూ ముందుకొచ్చిన ఎన్నారైలు
పర్చూరు, డిసెంబరు 28 : అన్నదాత సంతోషంగా ఉంటేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు చెప్పారు. సోమవారం ఎన్‌ఆర్‌ఐ మిత్రుల ఆత్మీయ ఆహ్వానం మేరకు మన రైతన్నల కోసం(అన్నదాత సుఖీభవ) జూమ్ కాన్ఫిరెన్స్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రసంగించారు. అన్నదాతలు సంతోషంగా ఉండాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు సమృద్ధిగా అందాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు కనుమరుగై పోయాయన్నారు. రైతులకు ఆధునిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఎన్‌ఆర్‌ఐలు ఇంకా ముందుకు రావాలని కోరారు. అటు ప్రజలకు, ఇటు రైతులకు అండగా నిలుస్తూ అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీటవేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సేవా నిరతిని ఎన్‌ఆర్‌లు కొనియాడారు.