గంగపుత్రుల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2020-12-12T05:26:35+05:30 IST

వల వినియోగంపై మత్స్యకార గ్రామాల మధ్య గత కొంతకాలం గా నెలకొన్న వివాదం ఘర్షణకు దారితీసింది. శుక్రవారం మత్స్యశాఖ అధికారులు, పోలీసు లు ప్రాథమికంగా వివాదం పరిష్కారానికి చ ర్యలు చేపట్టిన సమయంలోనే ఈ ఘటన జ రిగింది.

గంగపుత్రుల మధ్య ఘర్షణ
వాడరేవు తీరం వెంట రాళ్లతో దాడికి దిగిన మత్స్యకారులు

వాడరేవును వణికించిన వల వివాదం

అధికారుల సమక్షంలోనే దాడి.. ప్రతిదాడులు 

20మందికి గాయాలు

ఏరియా వైద్యశాలకు తరలింపు

పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు


చీరాల, డిసెంబరు 11 : వల వినియోగంపై మత్స్యకార గ్రామాల మధ్య  గత కొంతకాలం గా నెలకొన్న వివాదం ఘర్షణకు దారితీసింది. శుక్రవారం మత్స్యశాఖ అధికారులు, పోలీసు లు ప్రాథమికంగా వివాదం పరిష్కారానికి చ ర్యలు చేపట్టిన సమయంలోనే ఈ ఘటన జ రిగింది.  కఠారివారిపాలెం వారి అనుబంధ గ్రామాల మత్స్యకారులు మూకుమ్మడిగా వాడ రేవు వచ్చి అక్కడ విధ్వంసం సృష్టించారు. ఈ ఘర్షణలో 20మంది గాయపడ్డారు. వారిలో వాడరేవు గ్రామపంచాయితీ మాజీ సర్పంచ్‌ ఎ రిపిల్లి రమణ కూడా ఉన్నారు. 


ఘర్షణకు కవ్వింపే కారణమా.. 


వల వివాదం పరిష్కారం కోసం చర్చల్లో భాగంగా శుక్రవారం మత్స్యశాఖ జేడీ ఆవుల చంద్రశేఖరెడ్డి, ఏడీ రంగనాథబాబు, డీఎస్పీ శ్రీ కాంత్‌, రూరల్‌ సీఐ రోశయ్య, ఈపురుపాలెం, వేటపాలెం ఎస్సైలు సుధాకర్‌, కమలాకరరావు లు కఠారివారిపాలెం చేరారు. ప్రాఽథమికంగా క ఠారివారిపాలెం వారి ఆధీనంలో ఉన్న బోట్లను వాడరేవు వారికి, వాడరేవు వారి ఆధీనంలో ఉ న్న బోట్లను కఠారివారిపాలెం వారికి ఇప్పించి, తదుపరి చర్యలపై ఒక అవగాహనకు చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలనేది అధికారుల ఆలోచన. అయితే ఈనెల 2న ఒంగోలు జేడీ కార్యాలయంలో జరిగిన ఒప్పందాన్ని బేఖాత రు చేస్తూ వాడరేవు, దానవాయిపేటకు చెంది న కొందరు మత్స్యకారులు  వివాదాస్పద వల తో వేటాడుతున్నారని కఠారివారిపాలెం మత్స్య కారులకు తెలిసింది. ఇది కవ్వింపు చర్యని వా రు అధికారుల దృష్టికి తెస్తూనే వెంటనే సము ద్రంలోకి వెళ్ళి వాడరేవు వారి బోట్లు, అందులో ని వారిని ఒడ్డుకు తెచ్చారు. ఈ విషయం తె లుసుకున్న వాడరేవు మత్స్యకారులు తమ తీ రం సమీపంలో వేటాడుతున్న కఠారివా రిపాలెం మత్స్యకారుల బోటును, అందులోని వారిని వాడరేవు తీరంకు చేర్చారు. అది వారి కవ్వింపుచర్య కాదా అని వాడరేవు మత్స్యకారు లు ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో అధికారులు ప్రేక్షకపాత్ర వహించటం మినహా ఏం చేయలే క పోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు.


ఒక్కసారిగా మూకుమ్మడి దాడి


ఈక్రమంలో కఠారివారిపాలెం, వారి అను బంధ గ్రామాల మత్స్యకారులు పలువురు  స ముద్రమార్గంలో, రోడ్డు మార్గంలో ఒక్కసారిగా వాడరేవు చేరారు. ఏం జరుగుతుందో స్థానికు లకు అర్థమయ్యేలోపు వారు మూకుమ్మడిగా దాడులకు పాల్పడ్డారు. దొరికిన వస్తువులను, వాహనాలను ధ్వంసం చేశారు. దొరికిన వారిని దొరికినట్లు కొట్టారు. దీంతో వాడరేవు ఒక్కసా రిగా వణికింది.


అదనపు బలగాలు తరలింపు


మత్స్యకారుల ఘర్షణ నేపథ్యంలో డీఎస్పీ శ్రీకాంత్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధి కారులకు నివేదించారు. దీంతో అదనపు బ లగాలు వాడరేవు చేరాయి. పికెట్‌ ఏర్పాటు చే శారు. ఏఎస్పీ రవిచంద్ర, ఆర్డీవో ప్రభాకరరెడ్డి లు అధికారులతో పరిస్థితులపై సమీక్షించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని డీ ఎ స్పీ శ్రీకాంత్‌ తెలిపారు.


మీడియా ప్రతినిధులపై దాడి


వాడరేవు, కఠారివారిపాలెం మత్స్యకారుల మధ్య జరిగిన కొట్లాట నేపథ్యంలో ఆ ఘటన లను చిత్రీకరించేందుకు, సమచారాన్ని సేకరిం చేందుకు వెళ్ళిన ముగ్గురు ఎలకా్ట్రనిక్‌ మీడి యా ప్రతినిధులపై దాడి చేశారు. వారి సెల్‌ ఫోన్లు లాక్కున్నారు. ఈక్రమంలో డీఎస్పీ శ్రీ కాంత్‌ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 


బాధితులకు పరామర్శ


వాడరేవులో జరిగిన కొట్లాటలో గాయపడిన వారిని వైసీపీ నేతలు జంజనం శ్రీనివాసరావు, గవిని శ్రీనివాసరావు, జయరాం, సీపీఎం నేత లు ఎన్‌.బాబూరావు, బండారు జ్వాలా నరసిం హం తదితరులు బాధితులను పరామర్శించా రు. వాడరేవులో మత్స్యకారులతో మాజీ ఎమ్మె ల్యే ఆమంచి కృష్ణమోహన్‌ మాట్లాడారు.


రెండు, మూడు రోజుల్లో తదుపరి చర్యలు  


వాడరేపులో జరిగిన పరిణామం దురదృష్టకరం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం నేరం. 2వ తేదీనా మా కార్యాలయంలో జరిగిన ఒప్పందాన్ని ఎవరు ఉల్లంఘించారనే అంశాలను పూర్తి స్థాయిలో విచారిస్తాం. సమస్య పరిష్కారానికి పోలీస్‌, రెవెన్యూశాఖలతో కలిసి రెండు, మూడు రోజుల్లో తగిన చర్యలు చేపడతాం. ప్రస్తుతం జరిగిన ఘటన పూర్వాపరాలను ఉన్నతాధికారుల కు నివేదిస్తాం.


- ఎ,చంద్రశేఖరరెడ్డి, మత్స్యశాఖ జేడీ, ఒంగోలు




Updated Date - 2020-12-12T05:26:35+05:30 IST