చేపల వేటకు వెళ్లి జాలరి మృతి

ABN , First Publish Date - 2020-11-16T00:43:29+05:30 IST

గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లిన జాలరి బొజ్జా రామారావు(50) పడవలోనే కుప్పకూలి మృతి చెందాడు.

చేపల వేటకు వెళ్లి జాలరి మృతి
రామారావు మృతదేహం


అద్దంకి, నవంబరు 15 : గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లిన జాలరి బొజ్జా రామారావు(50) పడవలోనే కుప్పకూలి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌ ఎస్టీ కాలనీకి చెందిన బొజ్జా రామారావు శనివారం ఉదయం పట్టణ పరిధిలోని నర్రావారిపాలెం సమీపంలో ఉన్న గుండ్లకమ్మ రిజర్వాయర్‌ నీటిలో చేపల వేటకు వెళ్లాడు. చేపల వేట సమయంలోనే కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు గమనించి అతన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రామారావుకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు.  

Updated Date - 2020-11-16T00:43:29+05:30 IST